NTV Telugu Site icon

Mumbai: ఆస్పత్రిలో మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా ఫోన్‌లో షూట్.. నిందితుడు అరెస్ట్

Filmsbathingvideo

Filmsbathingvideo

ముంబై ఆస్పత్రిలో ఓ కార్మికుడు నీచానికి పాల్పడ్డాడు. మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా కిటికీలోంచి మొబైల్ ద్వారా రికార్డ్ చేశాడు. గమనించిన బాధితురాలు కేకలు వేయడంతో బండారం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు జయేష్ సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: VIVINT PHARMA: తెలంగాణాలో కొత్తగా ఇంజెక్టబుల్స్ తయారీ యూనిట్.. భారీగా ఉద్యోగాలు..

ముంబైలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్పత్రిలో పని చేస్తున్న మహిళా డాక్టర్ బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా కార్మికుడిగా ఉన్న జయేష్ సోలంకి కిటికీలోంచి మొబైల్‌లో రికార్డ్ చేశాడు. డాక్టర్ గమనించి ఆస్పత్రిలోని సిబ్బందిని అలర్ట్ చేసింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నిందితుడ్ని పట్టుకుని మొబైల్ చెక్ చేయగా వీడియో కనిపించింది. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన మంగళవారం (ఆగస్టు 6) జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు జయేష్ సోలంకి ఆస్పత్రిలో కాంట్రాక్టు కన్సర్వెన్సీగా పనిచేస్తున్నాడు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన సీఎం చంద్రబాబు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మహిళా వైద్యురాలు ఆస్పత్రిలోని రెస్ట్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. కాంట్రాక్టు వర్కర్‌గా పనిచేసిన జయేష్ సోలంకి అనే నిందితుడు మహిళా డాక్టర్ స్నానం చేస్తుండగా రహస్యంగా రికార్డు చేసినట్లు చెప్పారు. ఏదో అలికిడి జరగడంతో ఆమె అప్రమత్తం అయిందని తెలిపారు. నిందితుడ్ని ఆస్పత్రి సిబ్బంది పట్టుకున్నారని చెప్పారు. మొబైల్‌లో డాక్టర్ స్నానం చేస్తున్న దృశ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిందితుడు సోలంకి ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. వీడియో ఇంకెవరికైనా ఫార్వర్డ్ చేశాడన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తీయడం వెనుకు ఉద్దేశాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.

Show comments