Site icon NTV Telugu

Madhya Pradesh: భర్త మేనకోడలిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న భార్య..

Crime

Crime

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పెళ్లైన ఓ మహిళ భర్త మేనకోడలిని కిడ్నాప్ చేయడమే కాకుండా, ఆమెను పెళ్లి చేసుకుని లైంగికంగా వేధించింది. ఈ కేసులో సదరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన సదరు యువతి తాను ‘లెస్బియన్’ అని పోలీసులకు చెప్పింది. రాష్ట్రంలోని ఖార్గోన్‌కి చెందిన 24 ఏళ్ల మహిళ తన భర్త మైనర్ మేనకోడలిని అపహరించింది. పెళ్లి చేసుకుని, లైంగిక దోపిడికి పాల్పడినందుకు అరెస్ట్ చేసినట్లు సోమవారం పోలీస్ అధికారులు వెల్లడించారు.

Read Also: Amit Shah: ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల మధ్య పోలికే లేదు..

ఫిబ్రవరి 27న మహిళ 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిందని, వారిద్దరిని గుర్తించి తీసుకువచ్చామని బరూద్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ రితేస్ యాదవ్ తెలిపారు. తాను లెస్బియన్ అని నిందితురాలు చెప్పిందని, మహిళ, బాలికతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు అంగీకరించిందిన యాదవ్ తెలిపారు. బాలికను సదరు మహిళ ఇండోర్ నుంచి ధమ్నోద్‌కి తీసుకెళ్లిందని, అక్కడే ఇద్దరు భార్యభర్తల మాదిరిగా జీవించడం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలానని కోర్టులో నమోదు చేశారు. నిందితురాలు ఉమర్ఖలి గ్రామానికి చెందిన వ్యక్తిని ఏడాది క్రితం వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్త మేనకోడలితో శారీరక సంబంధాన్ని పెట్టుకున్నట్లు తేలింది.

Exit mobile version