NTV Telugu Site icon

Naveen Reddy: టాలీవుడ్‌ యంగ్‌ హీరో అరెస్ట్‌..

Naveen Reddy

Naveen Reddy

Naveen Reddy: సినీ నటుడు నవీన్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్ రెడ్డి.. కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అభియోగాలు మోపారు.. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు, ఎన్‌ స్క్వేర్‌ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం వెలుగు చూసింది.. నవీన్‌ రెడ్డిపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు.. దీంతో.. తనడిపై సెక్షన్లు 420, 465, 468, 471 r/w, 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. విచారణ తర్వాత నవీన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీసీఎస్‌ పోలీసులు.. చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు.. అయితే, ఎన్‌ స్క్వేర్‌ కంపెనీ డైరెక్టర్లను మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు చేసినట్టు.. ‘నో బడీ’ అనే పేరుతో హీరోగా సినిమా తీసినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు నవీన్‌రెడ్డి స్వస్థలం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెంగా చెబుతున్నారు.. నవీన్ రెడ్డిపై గతంలో బైక్ దొంగతనం కేసులు సైతం ఉన్నాయని చెబుతున్నారు.. నవీన్‌రెడ్డి కేసులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: Anand Mahindra: ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..