దేశంలో రోజురోజుకూ నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ప్రేమికుడితో సుఖం కోసం ఇల్లాల్లు రక్తసంబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటి దాకా కట్టుకున్నవాళ్లను కడతేర్చిన అర్ధాంగులు.. ఇప్పుడు కన్నపేగు పంచుకుని పుట్టిన బిడ్డలను కూడా కడతేర్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. కన్న బిడ్డలపై అనురాగాలు మసకబారిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉందని ఐదేళ్ల కూతురి గొంతుకోసి చంపేసింది. విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి: SSMB 29 : మహేశ్ మూవీ కోసం అంతా కొత్తవాళ్లే.. జక్కన్న ప్లాన్ ఏంటి..?
రోషి ఖాన్, షారుఖ్ ఖాన్ భార్యాభర్తలు. అయితే రోషి ఖాన్.. ఉదిత్ జైస్వాల్‌తో వివాహేతర సంబంధం నడిపిస్తోంది. అయితే ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె ప్రియుడితో ఉంటోంది. అయితే ప్రియుడితో ఉండేందుకు ఐదేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని భావించింది. కుమార్తెను చంపేసి భర్తపై తోసేయాలని ప్రణాళిక రచించింది. అంతే ఐదేళ్ల కూతురి గొంతు కోసేసి చంపేసింది. అనంతరం దఆమె పోలీసులకు ఫోన్ చేసి తన భర్త.. కుమార్తెను చంపేశాడని ఫిర్యాదు చేసింది. ఎందుకు చంపాడని పోలీసులు అడగగా.. గొడవ పడుతుండగా భర్త చంపేశాడని వాపోయింది.
ఇది కూడా చదవండి: HMD T21 Tablet: వాయిస్ కాలింగ్, 8200mAh బ్యాటరీతో HMD T21 విడుదల..!
ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. రోషి ఖాన్ అబద్ధం చెప్పినట్లుగా గుర్తించారు. ప్రేమికుడితో ఉండేందుకు కుమార్తె అడ్డుగా ఉందని భావించి.. బాలికను చంపేసి ఆ నేరాన్ని భర్త మీదకు నెట్టేయాలని భావించినట్లుగా పోలీసులు కనుగొన్నారు. సోమవారం రాత్రి భర్త ఇంటికి చేరుకున్నప్పడు ప్రేమికుడు లేడు. కొద్దిసేపటికే గొడవకు దిగారు. ఇదే అనుకూల సమయం అని కుమార్తెను చంపేసి.. ఆ నేరాన్ని భర్త మీదకు తోసేయాలని కుట్ర పన్నింది. మొత్తానికి పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితురాలు నేరాన్ని అంగీకరించింది.
బాలిక పోస్ట్‌మార్టం పూర్తయిందని పోలీసులు తెలిపారు. రోషి ఖాన్‌ను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ప్రేమ వ్యవహారం కారణంగానే కుమార్తెను సొంత తల్లి చంపేసిందని వెల్లడించారు. ఈ ఘటనతో తామంతా షాక్ అయ్యామని క్నో వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశ్వజీత్ శ్రీవాస్తవ అన్నారు.
