NTV Telugu Site icon

Karnataka: తల్లికూతుళ్లు వ్యభిచారం చేస్తున్నారని.. బయటకీడ్చి కొట్టారు..

Karnataka

Karnataka

Karnataka: తల్లికూతుళ్లు ఇద్దరు వ్యభిచారం చేస్తు్న్నారని ఆగ్రహించిన ఇరుగుపొరుగు వారిపై దారుణంగా ప్రవర్తించారు. ఇద్దరిని ఇంటిని నుంచి బయటకులాగి కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని ఆరోపిస్తూ.. 60,29 ఏళ్ల వయసు కలిగిన తల్లికూతుళ్లతపై దాడి చేశారు. వారి బట్టలు చింపేసి దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు.

Read Also: Bengaluru: రైడ్ క్యాన్సిల్.. ఆటో డ్రైవర్, యువతి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్..

మహిళలు ఇద్దరు ఈ ఘటనపై ఫిర్యాదు చేవారు. మహిళలతో పాటు పొరగు కుటుంబానికి చెందిన పలువరు తమ ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించి, ఇద్దరిపై భౌతికదాడికి దిగినట్లు చెప్పారు. దాడి చేసిన వారు తల్లి, కూతురు ఇద్దరు వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని వ్యక్తులు తరుచుగా తమ ఇంటికి వస్తున్నారని పోలీసులకు తెలిపారు. ఈ విషయం నగర పోలీసు కమిషనర్‌కు వెళ్లడంతో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఘటనపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు.

Show comments