NTV Telugu Site icon

Hyderabad Crime: తల్లి బలవన్మరణం.. షాక్ గురైన కొడుకు కూడా..

Hyderabad Crime

Hyderabad Crime

Mother and Son: తల్లీ కొడుకుల ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్ధిక సమస్యలతో తల్లి బలవన్మరణం చేసుకోవడంతో.. తల్లిని అలా చూసిన కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇద్దరు మృతి నగరంలో విషాదం నింపింది.

Read also: Tirupati Crime: టెంపుల్‌ సిటీలో సంచలనం రేపుతున్న ట్రిపుల్ మర్డర్‌.. అన్నపై కోపమే కారణమా?

ఒంగోలుకు చెందిన గుంజి శివ, అతని కుటుంబం అంటే గుంజి పద్మ, ఇద్దరు కుమారులు జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ కొత్తపేటకు వచ్చారు.
ఈ క్రమంలో.. గుంజు శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో గుంజి పద్మ కొంతకాలం క్రితం కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన పెద్ద కొడుకు గుంజి వంశీ కన్న తల్లిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురై తను కుడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదంతా క్షణాలలో జరిగిపోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. మృతురాలి రెండో కుమారుడు తన తల్లి మరణ వార్త ను స్థానిక బందువులకు, స్థానికులకు తెలియజేయడానికి వెళ్లి వచ్చే సరికి తన అన్న కుడా ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. కండ్ల ముందే తల్లి, తోడ బుట్టినవాడు నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయారా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.
Sangareddy Crime: లారీని వెనుకనుంచి ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి

Show comments