Palnadu Crime: పల్నాడు జిల్లాలో తల్లీకొడుకుల మృతి కలకలం సృష్టిస్తుంది. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండడంతో భార్య త్రివేణితో కలిసి నర్సరావుపేట ఆసుపత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాల్వ వద్ద బైకు స్కిడ్ అయ్యింది. దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయిన భార్య, కొడుకు కోసం గాలించినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన త్రివేణి మృతదేహాన్ని రెండు కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. చిన్నారి శరత్ కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు. అయితే, మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విబేధాలు ఉన్నాయని చెబుతున్నారు. త్రివేణి ఒంటిపై గాయాలు ఉన్నాయంటున్నారు. ఇద్దరిని భర్త శ్రీకాంత్ హత్యచేసి.. ప్రమాదం నాటకం ఆడుతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Woman Bitten by Snake: పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళ.. తర్వాత ఏమైందంటే..
