Betting: కోట్లు కురిపించే ‘క్రికెట్ బెట్టింగ్’ డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..

  • గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసిన వీరశేఖరాచారి..
  • ఈజీ మనీ కోసం అడ్డదారులు..
  • 15 ఏళ్ల క్రితం క్రికెట్ బెట్టింగ్‌లో పంటర్‌గా అవతారం..
  • బెట్టింగ్‌లలో డాన్‌గా మారిన వీరశేఖరాచారి..
  • గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కేసులు..
  • విజయవాడకు చెందిన కళ్యాణచక్రవర్తికి టోకరా..
  • నంద్యాల జిల్లా మహానందిలో వీరశేఖరాచారి పట్టివేత
Cheater

Cheater

అతనో గోల్డ్ అప్రైజర్… జల్సాలు, విలాసాలకు అలవాటు పడ్డాడు… అంతే కొత్త అవతారం ఎత్తాడు… క్రికెట్ బెట్టింగులతో కోట్లు సంపాదించాలని భావించాడు… మొదట పంటర్‌గా అవతారం ఎత్తాడు… తర్వాత బుకీగా మారాడు… పెద్ద పెద్ద బుకీలతో లింకులు పెట్టుకుని బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మూడు జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఆ బుకీ ట్రేడింగ్ పేరుతో మోసం చేసి అడ్డంగా పల్నాడు జిల్లా పోలీసులకు దొరికిపోయాడు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు వీరశేఖరాచారి అలియాస్ గోల్డ్ శేఖర్. ఊరు నర్సరావుపేట. మొదట గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసేవాడు. కానీ ఉన్నఫళంగా కోట్లు సంపాదించాలనే దురాశతో ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. ఈజీ మనీ కోసం.. క్రికెట్ బెట్టింగ్‌ను ఎంచుకున్నాడు. 15 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన క్రికెట్ బెట్టింగ్‌లో మొదట పంటర్ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో బెట్టింగ్‌ల ద్వారా కమీషన్ రూపంలో భారీగా డబ్బులు వచ్చాయి. అయినప్పటికీ కోట్ల రూపాయలు సంపాదించాలన్న దురాశ ఇంకా పెరిగింది. అంతే.. పంటర్ స్థాయి నుంచి పూర్తిస్థాయిలో బుకీగా మారాడు. పెద్ద ఎత్తున డబ్బులు వస్తుండడంతో తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ఎక్కడికక్కడ అనుచరులను ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున బెట్టింగులకు తెరతీశాడు. తొలుత పల్నాడు జిల్లాలో స్టార్ట్ చేసిన బెట్టింగ్‌లను కాస్తా పక్క జిల్లాలకు కూడా విస్తరించాడు. కొద్ది రోజుల్లోనే క్రికెట్ బెట్టింగ్‌లలో వీరశేఖరాచారి డాన్‌గా మారిపోయాడు.

×
×
Ad

బెట్టింగ్‌లు వేస్తున్న సమయంలోనే అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఫలితంగా వీరశేఖరాచారిపై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మూడు జిల్లా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రికెట్ బుకీగా మారాడు. బెట్టింగ్‌లతో ఆగని.. వీరశేఖరాచారి మరిన్ని మోసాలకు తెరతీశాడు. తాము ట్రేడింగ్ చేస్తున్నామని.. ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే భారీగా లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి విజయవాడకు చెందిన కళ్యాణచక్రవర్తిని నమ్మించాడు. దీంతో కళ్యాణ చక్రవర్తి కోటి 44 లక్షల రూపాయలు తన అనుచరుడైన రవితేజ ఎకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత రవితేజ తన భార్య లలిత ఎకౌంట్‌కు.. ఆ తర్వాత వీరశేఖరాచారి ఎకౌంట్‌కు కోటి 44 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయి.

డబ్బులు తీసుకున్న తర్వాత కళ్యాణచక్రవర్తి ఫోన్ చేసినా స్పందిచలేదు వీరశేఖరాచారి. దీంతో తాను మోసపోయానని భావించిన కళ్యాణచక్రవర్తి నర్సరావుపేట టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నవారిపై పల్నాడు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో వీరశేఖరాచారి అజ్ఞాతంలోకి వెళ్లాడు. పోలీసులు వీరశేఖరాచారి కోసం గాలింపులు చేపట్టారు. ఎట్టకేలకు వీరశేఖరాచారి నంద్యాల జిల్లా మహానందిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. వీరశేఖరాచారిపై పన్నెండు కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ కేసులతోపాటు పోక్సో కేసు, NDPS కేసులు రెండు నమోదయ్యాయంటున్నారు.

ఈజీ మనీకోసం క్రికెట్ బెట్టింగులకు తెరతీసిన వీరశేఖరాచారికి పెద్ద పెద్ద బుకీలతో కూడా సంబంధాలున్నాయని తేలిందంటున్నారు. ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు బెట్టింగ్ కేసులో అరెస్ట్ చేస్తే బెయిల్ పై విడుదలయ్యాడని చెబుతున్నారు. కడపలో కూడా వీరశేఖరాచారిపై బెట్టింగ్ కేసు నమోదయ్యిందని గుర్తించారు. ట్రేడింగ్ పేరుతో ఛీటింగ్ చేసిన కేసులో మరో ఇద్దరి కోసం గాలింపులు కొనసాగుతున్నాయంటున్నారు. ట్రేడింగ్ పేరుతో డబ్బులు తీసుకుని ఆ డబ్బులను క్రికెట్ బెట్టింగులో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని బుకీలు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోవద్దంటున్నారు పోలీసులు. ఏం తెలివిరా నాయనా అనే రీతిలో ట్విస్ట్ లతో మంచి హెడ్డింగ్ ఇవ్వు. గూగుల్ పిక్ చేసుకోవాలి.