NTV Telugu Site icon

Terrible Incident: భద్రాద్రి మహిళ మిస్సింగ్‌ కేసు విషాదాంతం.. 20 ముక్కలు చేసి పొలంలో..

Bhadradri Crime

Bhadradri Crime

Terrible Inciden: సింగరేణిలో ఉద్యోగం అంటే ఆ దంపతులు నమ్మారు. ఉద్యోగం వస్తే హ్యాపీగా బతికేయొచ్చు అనుకున్నారు. వడ్డీకి లక్షల్లో డబ్బు తీసుకుని మరో మహిళలకు, ఓ వ్యక్తికి ఇచ్చారు. అంతే అటు ఉద్యోగం రాక, ఇటు డబ్బులు లేక తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చిన మరో వ్యక్తి, మహిళకు మధ్య డబ్బుల వ్యవహారంలో విభేదాలు మొదలయ్యాయి. దీంతో విసుగు చెందిన వ్యక్తి మహిళను కిరాతకంగా హతమార్చాడు. చివరకు ఆమెను 20 ముక్కలు చేసి ఓ మూట పడేసి పంట పొలాల్లో పడేశాడు. మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న పోలీసులే షాకింగ్ గురి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో సంచలనంగా మారింది.

Read also: KA : కిరణ్ అబ్బవరం ‘క’ మలయాళం రిలీజ్ ఎప్పుడంటే..?

అసలు ఏం జరిగిందంటే..

జూలూరుపాడు మండలానికి చెందిన పార్వతి, రత్న కుమార్ అనే దంపతుల వద్ద ఖమ్మం జిల్లాకు చెందిన కొమ్ముగూడెంకు చెందిన వీరభద్రం, స్వాతి ఇద్దరు కలిసి 16 లక్షలు తీసుకున్నారు. సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో నెల నెల వడ్డీ పెరుగుతూ వచ్చింది. దీంతో రత్నకుమార్, పార్వతి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో స్వాతి, మృతి చెందిన రత్నకుమార్ కుటుంబానికి డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈనేపథ్యంలో స్వాతి, ప్రియుడు వీరభద్రం మధ్య విభేదాలు మొదలయ్యాయి. రూ. 16 లక్షలు వ్యవహారం స్వాతి ఎక్కడ పోలీసులకు తన గురించి ఫిర్యాదు చేస్తుందో అని వీరభద్రం భయపడ్డాడు. మాయమాటలు చెప్పి స్వాతికి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చాడు. స్వాతిని ఎవరూ గుర్తుపట్టలేనంతగా 20 ముక్కలు చేశాడు వీరభద్రం.

Read also: Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరు..

ముక్కలుగా చేసిన స్వాతిని ఒక మూటలో వేసి.. పక్కనే వున్న పొలంలో పడేసి ఏమీ తెలియనట్లు వీరభద్రం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే స్వాతి మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న భద్రాది పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఓ రైతు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పంట పొలాల వద్దకు వెళ్లిన పోలీసులు షాకింగ్ కు గురయ్యారు. ఒక మూటలో ముక్కలుగా వున్న మహిళ మృత దేహాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆ మూటను ఆసుపత్రికి తరలించి పరిశీలించగా అందులో వున్న ముక్కలైన మృతదేహం స్వాతిది అని గుర్తించారు. గత కొద్దిరోజులుగా స్వాతి అనే మహిళ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసున్న విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను ఇలా ముక్కలు చేసింది వీరభద్రం అని గుర్తించారు. వీరభద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pushpa 2 : చివర్లో టెన్షన్ పెడుతున్న పుష్పరాజ్?

Show comments