Site icon NTV Telugu

Missing Body Found: గోదావరిలో గల్లంతైన మృతదేహం లభ్యం

మహా శివరాత్రినాడు విషాదం నెలకొంది. పర్వదినం సందర్భంగా గోదావరి స్నానానికి వెళ్ళి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం బిల్ట్ ఇంటెక్వెల్ సమీపంలోఈ సంఘటన జరిగింది. గల్లంతయిన యువకుడిని భూక్యా సాయి(20 )గా బంధువులు గుర్తించారు. అతని మృతదేహం లభించడంలో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కమలాపురం టీడీపీ కాలనీకి చెందిన భూక్య సాయి తమ బంధువులు, చట్టుప్రక్కల ఇళ్ళవారితో కలిసి మంగళవారం ఉదయం గోదావరి స్నానం చేయడం కోసం వెళ్ళారు.

గోదావరిలో స్నానం చేస్తుండగా భూక్యా సాయి, భూక్యా తరుణ్ అనే ఇద్దరు యువకులు గోదావరి నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అక్కడ ఉన్నవారు గమనించి ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు.

https://ntvtelugu.com/six-arrested-in-karmanghat-religious-riots-case/

ఈ క్రమంలో తరుణ్ ను గోదావరి లోపలి నుండి బయటకు తీసి ప్రాణాలతో కాపాడారు. సాయి గోదావరిలో మునిగిపోవడంతో అతని ఆచూకీ లభించ లేదు. దీంతో గోదావరిలో గల్లంతయిన భూక్య సాయి ఆచూకీ కోసం భూక్యా సాయి కుటుంబ సభ్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి నాటు పడవలతో వలలు వేస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సాయంత్రం పొద్దుపోయాక సాహి మృతదేహం లభించింది. మహా శివరాత్రి పండుగ నాడు ఈ దుర్ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Exit mobile version