Site icon NTV Telugu

Crime Job : రోజుకు రూ.1000 జీతం… కానీ పని దొంగతనాలే.!

Theft

Theft

పనీపాట లేక.. అవారాగా తిరుగుతున్న పోకిరీలకు ఉద్యోగాలు ఇస్తున్నాడో వ్యక్తి ! అలా అని అతడ్ని మహానుభావుడు అనుకునేరు !! పెద్ద కంత్రీ ఫెలో. అతడు ఇచ్చే ఉద్యోగం ఏంటో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. నిత్యం రద్దీ ప్రదేశాల్లో తిరుగుతూ సెల్‌ఫోన్లు దొంగిలించి తీసుకురావాలి. ఇందుకు మూడు పూటలా తిండి పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయల జీతం ఇస్తాడు. ఉండటానికి షెల్టర్‌ ఇస్తాడు. ఎక్కువ ఫోన్లు దొంగిలించిన వాడికి బోనస్‌లు కూడా ఇస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ దొంగల ముఠా ఆటకట్టించారు పోలీసులు. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తూ… భోజనం పెడుతూ… దొంగతనాలు చేయిస్తున్నాడో గ్యాంగ్‌ లీడర్‌. వీళ్లు చేయాల్సిందల్లా ఒకటే..!! పొద్దున్నే రద్దీ ప్రదేశాల్లో డ్యూటీ ఎక్కాలి. ఒంటరిగా ఉన్న వారినో, బిజీగా ఉన్న వారినో టార్గెట్ చేసి.. సెల్‌ ఫోన్లు చోరీ చేయాలి. తీసుకొచ్చి గ్యాంగ్‌ లీడర్‌కి ఇవ్వాలి. ఇలాంటి కంత్రీ దొంగల ముఠా గుట్టురట్టు చేశారు మెహిదీపట్నం పోలీసులు..

UP News: పెళ్లికి ముందు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్.. బిగ్ ట్విస్ట్‌తో అంతా షాక్..

వెస్ట్‌బెంగాల్‌కి చెందిన సాగర్‌ కుమార్‌ నోనియా మెహిదీపట్నంలో ఉంటున్నాడు. జార్ఖండ్‌, వెస్ట్‌ బెంగాల్ రాష్ట్రాల నుంచి పనుల కోసం హైదరాబాద్‌ వచ్చిన యువకులను తన వద్ద పనిలో చేర్చుకుంటున్నాడు. నెలంతా కష్టపడినా మీరేం సంపాదించలేరని.. తాను చెప్పిన పని చేస్తే లక్షలు సంపాదించొచ్చు అని మాయమాటలు చెప్పి.. దొంగలుగా మార్చుతున్నాడు. ఉండటానికి షెల్టర్‌ ఇచ్చి.. మూడు పూటల భోజనం పెట్టి.. రోజుకు వెయ్యి రూపాయలు జీతం ఇస్తున్నాడు. ఈ యువకులు బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో టీ అమ్ముతున్నట్టు నటిస్తూ.. లేదా ప్రయాణికులుగా నటిస్తూ.. సెల్‌ఫోన్లు దొంగిలిస్తారు. రోజంతా దొంగిలించిన ఫోన్లను సాయంత్రానికి తమ లీడర్‌ సాగర్‌ కుమార్‌ నోనియాకు అప్పగిస్తారు. వాటిని సాగర్‌ కుమార్‌ దొంగ మార్కెట్లో అమ్ముకుంటాడు..

వరుస సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లపై నజర్‌ పెట్టిన మెహిదీపట్నం పోలీసులు.. ఈ ముఠాను పట్టుకున్నారు. వెస్ట్‌ బెంగాల్‌కి చెందిన అనిల్ కుమార్‌ నోనియా, గౌరవ్‌ నోనియా, జార్ఖండ్‌‌కి చెందిన పరణ్‌ కుమార్‌, దేవా కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే 21 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పెంచి పోషిస్తున్న గ్యాంగ్‌ లీడర్ సాగర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు..

Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.!

Exit mobile version