Medchal Wife Murder: అనుమానం.. ఆమె ప్రాణం తీసింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. బంధువుల ఇంటికి వెళ్లిన భార్యను.. అక్కడికి వెళ్లి మరీ అతి కర్కశంగా నరికేశాడు ఓ భర్త. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో జరిగింది. ఆమె పేరు మంజుల. ఈమెకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అడ్డగూడూర్‌కు చెందిన బోడ శంకర్‌తో పెళ్లి జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. మంజుల ఎవరితోనైనా సఖ్యతగా మాట్లాడితే.. ఆమెను శంకర్ అనుమానించేవాడు. వారిద్దరి మధ్య అనుమానం..రాను రాను పెనుభూతంగా మారింది…
READ ALSO: Bigg Boss 9 : బిగ్ బాస్ నుంచి కీలక కంటెస్టెంట్ ఎలిమినేట్
గతంలో వారిద్దరూ ముంబైలో కాపురం పెట్టారు. కానీ అక్కడ కూడా చాలా గొడవలు జరుగుతుండడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా భర్త తీరులో ఎలాంటి మార్పు రాలేదు. మంజుల ఇతరులతో సంబంధాలు పెట్టుకుందని శంకర్ అనుమానించేవాడు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం శంకర్ అక్క, బావ ఇంటికి వెళ్లారు. అప్పటికే బోడ శంకర్ తన భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో తన ప్లాన్ అమలు చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసేశాడు. విచక్షణారహితంగా నరికేశాడు. కానీ ఆమె అరుపులకు అందరూ లేవడంతో అక్కడి నుంచి పారిపోయాడు శంకర్. అతడు వెళ్తున్న దృశ్యాలు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు హుటాహుటిన మంజులను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందింది…
శంకర్ అక్క, బావ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం శంకర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనుమానంతోనే హత్య చేశాడని బంధువులు చెబుతున్నారు..
READ ALSO: Bathukamma: బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల నైవేద్యాలు తెలుసా!
