NTV Telugu Site icon

Massive Theft: అనంతపురంలో భారీ చోరీ.. రూ.3.5 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షలు మాయం

Jagital Crime

Jagital Crime

Massive Theft: అనంతపురం శివారులో రాజహంస విల్లాస్‌లో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో రూ. 3.5 కోట్ల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు. కూతురు వివాహం కోసం దాచి వుంచిన నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో నుంచి దాదాపు రూ. 20 లక్షలు తీసుకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Davos: తెలంగాణ ప్రభుత్వంతో మరో ఒప్పందం.. జేఎస్‌డబ్ల్యూ భారీ పెట్టుబడులు

పూర్తి వివరాల్లోకి వెళ్తే బాధితుడు వెంకట శివారెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువాలో దాచిఉంచిన రూ.20 లక్షల నగదుతో పాటు ప్రత్యేక లాకర్‌లో ఉంచిన రూ.3.50 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు వెంకటశివారెడ్డి దంపతులు వాపోయారు. వచ్చే నెల ఫిబ్రవరిలో కుమార్తె పెళ్లి ఉండడంతో బంగారు, డబ్బు అంతా ఇంట్లోనే ఉంచుకున్నట్లు దంపతులు తెలిపారు. పెళ్లి కార్డులు బంధువులకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు శివారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అనంతపురం నగర శివారులోని బెంగుళూరు – హైదరాబాద్ హైవే సమీపంలోని సవేరా ఆసుపత్రి వెనుకవైపున్న రాజహంస విల్లాస్ లో ఈ చోరీ చోటు చేసుకుంది..