Site icon NTV Telugu

కన్నతల్లి దారుణం.. రెండేళ్ల పాపను కిరాతకంగా చంపి ఆపై ..

women suicide

కర్ణాటకలో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవలు పడలేని ఒక మహిళ.. రెండేళ్ల బిడ్డను కిరాతకంగా చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని గట్టివాడి గ్రామంలో మహాదేవ్ ప్రసాద్ అనే వ్యక్తి భార్య అన్నపూర్ణతో కలిసి నివసిస్తున్నాడు. పాప ఉంది. పెళ్ళైన కొద్దిరోజులు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో విబేధాలు తలెత్తాయి.

నిత్యం భార్యాభర్తల మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. ఇక శుక్రవారం కూడా భర్తతో గొడవపడిన గొడవపడిన భార్య అన్నపూర్ణ.. అతను బయటికి వెళ్లాకా రెండేళ్ల పాపను నీళ్ల బకెట్ లో ముంచి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోంది . బయటికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగివచ్చేసరికి భార్యాబిడ్డలు విగత జీవులుగా పడిఉండడం చూసి కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version