Escape With Student: ఓ మహిళకు పెళ్లి కావడంతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో బాల్యం నుంచి పరిచయం ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థి తన జీవితంలోకి వచ్చాడు. బాల్యంలో వారి మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యం వారి మధ్య ప్రేమ చిగురించింది. సమయం చూసి ఇద్దరు కలిసి జంప్ అయ్యారు. వారిద్దరు కలిసి కర్ణాటకలోని కార్వార్‌కు వచ్చారు. భార్య కనిపించకుండా పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ అంతా బయటపడింది. దీనితో పోలీసులు యువకుడితో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
Vizag Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్..
బీర్ మోహిద్దీన్ అనే యువకుడు తమిళనాడులోని చెన్నెకి చెందినవాడు. ఇటీవల ఇంజినీరింగ్‌ను పూర్తి చేశాడు. బీర్ మోహిద్దీన్‌కు దూరపు బంధువు, సదరు మహిళ మామ అయిన అబ్దుల్ ఖాదర్ పెళ్లి సంబంధాలను చూడటం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు ఖాదర్ ఇంటికి వెచ్చి వెళ్లేవాడు. ఖాదర్ కోడలైన ఆయేషాతో మోహిద్దీన్‌కు బాల్యం నుంచి పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రేమ చిగురించగా.. ఆమెను తీసుకుని కార్వార్‌కు పారిపోయాడు. ఎవరికీ తెలియకుండా అక్కడే వారు ఆరు నెలలు నివాస ఉంటున్నారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు ఆయేషాను వెతుకుతూ కార్వార్‌కు వచ్చి స్థానిక పోలీసుల సాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గత ఫిబ్రవరి నుంచి వారు ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లు విచారణలో తేలింది.
