NTV Telugu Site icon

Love Jihad: మతం మారనన్నందుకు.. భర్త కీచకపర్వం

Lucknow Love Jihad Case

Lucknow Love Jihad Case

Married Woman Beaten By Husband For Not Accepting Islam In Lucknow: ఆ జంటది ప్రేమ వివాహం. ప్రేమించుకునే సమయంలో వీరి మధ్య కులం, మతం అడ్డు రాలేదు. అన్నీ మరిచి ప్రేమించుకున్నారు. వివాహ బంధంతో ఒక్కటి కూడా అయ్యారు. అప్పుడే అసలు సమస్య మొదలైంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త బాంబ్ పేల్చాడు. మతం మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఆమెను వేధించడం మొదలుపెట్టారు. కీచకపర్వం ప్రదర్శించాడు. ఎలాగోలా అతని చెర నుంచి తప్పించుకున్న ఆ మహిళ.. పోలీసులతో అతని భరతం పట్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Chandrababu: పవన్‌ కల్యాణ్‌పై చంద్రబాబు హాట్‌ కామెంట్స్..

చాంద్ అహ్మద్ అనే వ్యక్తి.. తనని తాను సాని మౌర్యగా ఓ మహిళతో పరిచయం చేసుకున్నాడు. ఆమె ప్రేమలో ముగ్ధుడైన అతగాడు.. తన ప్రేమను తెలియజేశాడు. ఆ మహిళ కూడా అతడ్ని ప్రేమించింది. మనసులతో పాటు అభిరుచులు కూడా కలవడంతో.. కొన్నాళ్ల క్రితం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత లక్నోలో అద్దెకు ఇల్లు తీసుకొని, కాపురం పెట్టారు. కొంతకాలం పాటు తమ దాంపత్య జీవితం సజావుగానే సాగిందని, ఆ తర్వాత నుంచి భర్త తనని వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడని ఆ మహిళ ఆరోపించింది. తనను ఇస్లాం మతం స్వీకరించాలని బలవంతం చేస్తున్నాడని వాపోయింది. అందుకు తాను అంగీకరించకపోవడంతో.. శారీరకంగా హింసించడం ప్రారంభించాడని, సిగరెట్ పీకలతో కాల్చడమే కాకుండా వేడి నూనె కూడా పోశాడని తన ఫిర్యాదులో పేర్కొంది.

Veera Simha Reddy: మొదటి రోజే హాఫ్ సెంచరీ… బాలయ్య ఊచకోత

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇతరులకు చెప్పినా.. తనని చంపేస్తానని తన భర్త బెదిరించాడని సదరు మహిళ పేర్కొంది. అంతేకాదు.. బంధువులతో అత్యాచారం కూడా చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడని తెలిపింది. తాను చాలాసార్లు ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించానని, అప్పుడు గదిలోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టేవాడని ఆమె చెప్పింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా భర్త తనని కొట్టాడని, దాంతో గర్భస్రావం జరిగిందని ఆమె పేర్కొంది. తన భర్త నుంచి రక్షణ కల్పించాలని, తీవ్రంగా హింసించిన అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Traffic Jam: టోల్​ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్​ టైంవేస్ట్ చేసుకోవద్దన్న సజ్జనార్​

Show comments