NTV Telugu Site icon

Dollars: అప్పడాల మాటున అమెరికా డాలర్లు..!

Dollars

Dollars

అప్పడాలు, మసాలా దినుసుల మాటున అమెరికా డాలర్లు తరలిస్తూ దొరికిపోయాడో వ్యక్తి.. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికిచేరుకున్నాడు ఓ వ్యక్తి… అయితే, సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అతడి లగేజీని చెక్‌ చేశారు.. వాటిలో మసాలా దినుసుల బాక్సులు, అప్పడాల పాకెట్లు కనిపించాయి… అంతే కాదు.. అక్కడే ఓ షాకింగ్‌ ట్విస్ట్‌ ఉంది.. అప్పడాల మధ్యలో దాదాపు 19,900 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 15 లక్షలు దాచి ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని ఎందుకు తీసుకెళ్తున్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు..

Read Also: Loans Write Off: 10 లక్షల కోట్ల రూపాయల లోన్లు రద్దు. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం యొక్క టెర్మినల్ 3 వద్ద భద్రతా తనిఖీల సమయంలో ఉదయం 5 గంటలకు ఓ ప్రయాణీకుడి లగేజీని తనిఖీ చేశాం.. పాపడ్ ప్యాకెట్లలో దాచిన రూ. 15 లక్షల విలువైన డాలర్లు కలిగి ఉండడాన్ని గుర్తించాం.. మసాలా దినుసుల బాక్స్‌లు, పాపాడ్ ప్యాకెట్ల మధ్య డాలర్లు దాచి ఉంచాడని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.. మొత్తం 19,900 అమెరికా డాలర్ల విలువ.. ప్రస్తుత విలువ ప్రకారం రూ. 15.5 లక్షలుగా చెబుతున్నారు.. ఆ వ్యక్తిని తన ఎయిర్ విస్తారా విమానం నుంచి కిందకు దించిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) సిబ్బంది.. కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కాగా, భారీ ఎత్తున బంగారం, విదేశీ కరెన్సీ, విలువైన వస్తువులు తరలిస్తూ నిత్యం ఎయిర్‌పోర్టుల్లో పట్టుబడే ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం.. కొత్త కొత్త తరహాలో బంగారాన్ని, డ్రగ్స్‌ను తలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.