ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ లో షాకింగ్ ఘటన జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి కొడవలితో మహిళ ముక్కును కోసి చంపాడు. తనపై వేధింపుల ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమెపై దాడి చేశాడు. సోమవారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లిన ఆమెపై నిందితులు దాడి చేశారు. దాడి తర్వాత స్పృహతప్పి పడిపోయిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read:statue of Ambedkar: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం..కేసీఆర్‌పై దళిత మేధావులు హర్షం
నిందితుడు రాజేష్ కుమార్‌పై మూడేళ్ల క్రితం ఆమె గ్రామానికి చెందిన మహిళపై వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సంజీవ్ బాజ్‌పాయ్ తెలిపారు. సాయంత్రం మహిళ షాపింగ్ చేయడానికి మార్కెట్‌కు వెళ్తుండగా, కుమార్ ఆమెపై కొడవలితో దాడి చేసి ముక్కు కోశాడని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.