NTV Telugu Site icon

Husband Suicide: ‘‘నా చావుకు భార్య, అత్త కారణం’’.. వేధింపులకు మరో భర్త బలి..

Crime

Crime

Husband Suicide: భార్య, భార్య తరుపు బంధువల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ వ్యవహారం కూడా ఈ కోవకు చెందినదే. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఇది జరిగిన తర్వాత, మరికొందరు కూడా తమ భార్యల వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

Read Also: India vs South Africa: భారత్, సౌతాఫ్రికా మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఇదిలా ఉంటే, మరో భర్త కూడా వేధింపులు తట్టుకోలేక తనువు చాలించాడు. మధ్యప్రదేశ్ రేవాలోని సిర్మౌర్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘‘తన చావుకు భార్య, అత్త వేధింపులు కారణం’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఈ సంఘటన లోపల జరుగుతుండగా అతడి భార్య లైవ్ వీడియోను చూసినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఇద్దరు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కూడా భార్య, అత్తల వేధింపులే ప్రధానంగా ఉన్నాయి. తనపై తప్పుడు గృహహింస కేసులు పెట్టారని అతను ఓ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్య తర్వాత చట్టాలను సవరించాలనే డిమాండ్ వ్యక్తమైంది. మరోవైపు, మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ప్రియుడు సాహిల్ శుక్లాలు కలిసి చంపేసి, 15 ముక్కలుగా నరికి, డమ్ములో సిమెంట్‌లో కప్పేసిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.