AP Crime: అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలంలోని నారమాకులపల్లిలో దారుణం చోటుచేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నారమాకుల పల్లికి చెందిన చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో బాది చంపిన ఘటన చోటు చేసుకుంది.. ఎన్నికల సమయంలో నీలావతి పెద్ద కూతురైన రెడ్డి సుధాకు అల్లుడు విజయ్ కుమార్ మధ్య వివాదం చోటు చేసుకుంది.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగినట్టు తెలుస్తుంది.. దీంతో.. ఎన్నికల సమయంలో కూతురిని తన ఇంటికి తీసుకొచ్చిన నీలావతి.. తన ఇంట్లోనే కూతురును పెట్టుకుంది.. అయితే, శుక్రవారం రోజు చిత్తూరు సొంత ఊరు నుండి నారమాకులపల్లికి వచ్చాడు విజయ్ కుమార్.. భార్యను తనతో పంపాలని కోరాడు.. అత్త నిరాకరించడంతో.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు.. ఈ క్రమంలో ఈరోజు ఉదయం పొడవాటి కర్ర తీసుకొని అత్త తలపై బలంగా కొట్టాడు.. దీంతో.. ఘటనాస్థలంలోనే కుప్పకూలి మృతిచెందింది.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న కేవీ పల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..
Read Also: Deadpool & Wolverine Review: డెడ్ పూల్ వాల్వరిన్ రివ్యూ.. కుర్చీ మడత పెట్టాడా? లేదా?
