NTV Telugu Site icon

Extramarital Affair: మరిదితో వదిన రాసలీలలు.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?

Man Illegal Affair

Man Illegal Affair

Man Killed His Brother For Having Extramarital Affair With His Wife: రానురాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావి, వరసలు లేకుండా.. కొందరు వివాహేతర సంబంధాలు పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఓ వదిన తన మరిదితోనే ఎఫైర్ పెట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. తాను చేస్తోంది పాడు పని అని తెలిసినప్పటికీ.. మరిదిని లొంగదీసుకుంది. తన భర్త లేనప్పుడు రాసలీలలు కొనసాగించింది. తన అన్నయ్యకి అన్యాయం చేస్తున్నానని తెలిసినా, వదిన మోజులో హద్దుమీరాడు. అయితే.. వీరి ఎఫైర్ ఎంతోకాలం దాగి ఉండలేదు. ఒక రోజు రెడ్‌హ్యాండెడ్‌గా మరిదితో భార్య పట్టుబడింది. దీంతో తట్టుకోలేక.. తన తమ్ముడ్ని కడతేర్చాడు అన్నయ్య. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాధం కృష్ణ, సాధం నరేష్ అన్నదమ్ములు. వీళ్లిద్దరికీ పెళ్లయ్యింది. పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే.. సాదం కృష్ణ భార్య, సాదం నరేష్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ భాగస్వాములు ఇళ్లల్లో లేనప్పుడు.. వీళ్లు ఇంట్లో రాసలీలలు కొనసాగించేవారు. ఒక రోజు సాదం నరేష్ భార్య పుట్టింటికి వెళ్లడం, అదే సమయంలో సాదం కృష్ణ కూడా పని నిమిత్తం బయటికి వెళ్లడంతో.. అతని భార్య, సాదం నరేష్ ఇంట్లో ఏకాంతంగా సరసాసల్లాపాల్లో మునిగితేలారు. ఇంతలో సాదం కృష్ణ ఇంటికి తిరిగొచ్చాడు. లోపలి నుంచి తలుపు వేసి ఉండటం, తన ఇంట్లో నుంచి తమ్ముడు బయటికి రావడంతో.. వారి మధ్య వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని అన్నయ్య పసిగట్టాడు. అప్పట్నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఈ ఆదివారం కూడా గొడవ జరగడంతో.. వాళ్లిద్దరి భార్యలు తమతమ పుట్టిళ్లకు వెళ్లిపోయారు. తన భార్యతో సాదం నరేష్ అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఈ రాద్ధాంతం జరిగిందని.. సాదం కృష్ణ తన తమ్ముడిపై కోపం పెంచుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి తాగొచ్చిన సాదం కృష్ణ.. సోమవారం తెల్లవారుజామున గొడ్డలితో సాదం నరేష్ తల నరికి చంపేశాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.