Site icon NTV Telugu

Crime Incident: పదిరోజులకోసారి ఇంటికి.. గదిలో కుళ్లిన శవం

Man Killed Married Woman

Man Killed Married Woman

పదిరోజులకోసారి ప్రసాద్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళొచ్చే ఓ వివాహిత.. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిస్థితిలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసాద్‌(35), గత ఆరు నెలల నుంచి ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కుక్‌గా పని చేసే ఇతని ఇంటికి.. శిరీష అనే మహిళ ప్రతి పదిరోజులకోసారి వచ్చి వెళ్తుండేది. ఈ విషయం చుట్టుపక్కల నివేసించే స్థానికులకు కూడా తెలుసు.

కట్ చేస్తే.. సోమవారం నాడు ప్రసాద్ తన ఇంటి పక్కన ఉండే వారికి ఫోన్ చేసి, తన గదిలో శిరీష చనిపోయిందని చెప్పి కట్ చేశాడు. దీంతో, ప్రసాద్ ఇంటి వద్దకు వెళ్ళ వెళ్లగా దుర్వాసన వచ్చింది. అప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు తెరిచి చూడగా.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం లభ్యమైంది. గోడలపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. అక్కడి పరిస్థితుల్ని గమనించిన పోలీసులు.. గోడకు బలంగా బాదడం వల్లె ఆమె మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శవం కుళ్లిపోయిన స్థితిని చూస్తే.. రెండు, మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇదే సమయంలో పోలీసులకు ప్రసాద్ గదిలో శిరీష ఫోటో లభ్యమైంది. పక్కా ప్రణాళిక ప్రకారమే అతడు ఆ ఫోటో పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. శిరీష ఆ వ్యక్తికి ఏమవుతుందన్న విషయంపైనే క్లారిటీ లేదు. కొందరేమో అతని భార్యేనని చెప్తోంటే, అలాంటప్పుడు పదిరోజులకోసారి ఇంటికి ఎందుకొస్తోంది? అని మరికొందరు అనుమానిస్తున్నారు. ప్రసాద్‌తో ఈమెకున్న రిలేషన్, అలాగే ఎందుకు చంపాడన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version