Site icon NTV Telugu

Angry Husband: బ్రష్ చేయకుండా ముద్దులు.. అడ్డుకున్న భార్యను చంపేసిన భర్త!

Angry Husband Hacks Wife To Death

Angry Husband Hacks Wife To Death

కలకాలం తోడుగా ఉంటానని, కంటికి రెప్పలా చూసుకుంటానని పెళ్లి చేసుకున్న భర్తే ఆమె పాలిట యముడిలా మారాడు. కొడుకుని ముద్దు పెట్టుకోవడాన్ని అడ్డుకుందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కిరాతకుడు. ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన దీపిక(28), తన భర్త అవినాశ్​(30)తో కలిసి పాలక్కాడ్ జిల్లాలోని కరాకురుస్సి ప్రాంతంలో నివాసం ఉంటోంది. అవినాశ్ ఎయిర్ ఫోర్స్ సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలో సహాయ సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. అయితే ఉదయే నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కొడుకుని ముద్దు పెట్టుకునేందుకు అవినాశ్ ప్రయత్నించగా.. భార్య దీపిక అడ్డుకుంది. పళ్లు తోముకోకపోవడంతో భార్య దీపిక దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. కోపంతో ఊగిపోయిన అవినాశ్.. దీపికపై కత్తితో దాడి చేశాడు. దీంతో దీపిక తల, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. అరుపులు విన్న పొరుగింటివారు దీపికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు అవినాశ్ రెండు నెలల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి కరాకురిస్సికి వచ్చాడు. అవినాశ్ కు దీపిక రెండో భార్య. ఒడిశాకు చెందిన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అతడు.. 2019లో దీపికను పెళ్లి చేసుకున్నాడు.

Exit mobile version