Man Got Killed Who Asked A Married Woman To Fulfil His Desire: అతడు వివాహితుడు, మంచి భార్య ఉంది. అయినా మరో వివాహితపై కన్నేశాడు. ఆమెతో కామవాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి, తన కోరిక తీర్చమని అడిగాడు. ఆ తర్వాత అతడు శవమై కనిపించాడు. తన భార్యపైనే కన్నేస్తావా? అంటూ ఆమె భర్త ఆ వ్యక్తిని కిరాతకంగా హతమార్చాడు. పక్కా స్కెచ్ వేసి మరీ హత్య చేశాడు. ఈ ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రమైన దౌల్తాబాద్‌కు చెందిన సీ శేఖర్(32) అనే వ్యక్తి హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన బీ గోపాల్ కూడా హైదరాబాద్‌లో పని చేస్తున్నాడు. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో కలిసి కూలి పనులు చేసుకునే వారు. దౌల్తాబాద్‌లో వీరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి.
Vyooham: వర్మ ‘వ్యూహం’లో చిరు, పవన్.. ‘అల్లు’ వారిని కూడా వదలలేదుగా!
కట్ చేస్తే.. గోపాల్ రెండు నెలల క్రితమే తిరిగి దౌల్తాబాద్‌కి వచ్చాడు. శేఖర్ కూడా పని నుంచి విశ్రాంతి తీసుకొని, నాలుగు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. అయితే.. అతడు గోపాల్ భార్యపై కన్నేశాడు. ఆమెతో కామవాంఛ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన కోరిక తీర్చమని అతడు అడిగాడు. అందుకు తిరస్కరించిన ఆమె.. ఈ విషయాన్ని తన భర్త గోపాల్‌కు తెలియజేసింది. దీంతో రగిలిపోయిన గోపాల్.. ఎలాగైనా శేఖర్‌ని అంతమొందించాలని నిర్ణయించాడు. ఈ నేపథ్యంలోనే అతడు శేఖర్‌ని ఓ దాబాకు తీసుకెళ్లాడు. మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి, ఆ ఇద్దరు ఒక పొలంలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. తీవ్ర కోపాద్రిక్తుడైన గోపాల్.. ముందుగా బీరు సీసా పగలగొట్టి శేఖర్‌ని పొడిచాడు. ఆపై బండరాయితో శేఖర్ తలపై మోదాడు. అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయాడు.
Sunil Gavaskar: ధోనీ కాదు, అసలైన కెప్టెన్ కూల్ అతడే.. లిటిల్ మాస్టర్ ఫిట్టింగ్
గోపాల్ ఒక్కడే ఇంటికి రావడంతో.. శేఖర్ భార్య నా భర్త ఎక్కడ అని అతడ్ని అడిగింది. తనకు తెలియదని అతడు సమాధానం చెప్పాడు. ఇద్దరు కలిసే వెళ్లారు కదా, మరి తెలియదంటావేంటి? అని నిలదీసింది. అతడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో.. శేఖర్ భార్యకు అనుమానం వచ్చింది. దాంతో ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గోపాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తన భార్యపై కన్నేసినందుకే దాడి చేశానని గోపాల్ ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి వెళ్లగా.. అప్పటికీ శేఖర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.