NTV Telugu Site icon

Shraddha Walker Like Incident: శ్రద్ధా వాకర్ తరహాలో మరో ఘటన.. మహిళను చంపి, 50 ముక్కలు చేసి..

Man Killed Wife

Man Killed Wife

Man Detained For Allegedly Killing Wife Chopping Body Into 50 Pieces: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యోదంతం గురించి అందరికీ తెలిసిందే! తన ప్రియురాలైన శ్రద్ధాను ఆఫ్తాబ్ పూనావాలు కిరాతకంగా చంపి, 35 ముక్కలుగా కోశాడు. ఇప్పుడు ఇదే తరహా సంఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. తన భార్యని ఓ వ్యక్తి దారుణంగా చంపి, 50 ముక్కలుగా ఆమె మృతదేహాన్ని కోసి, వివిధ ప్రాంతాల్లో ఆ ముక్కల్ని పడేశాడు. ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ‘మిస్సింగ్ కేసు’ పెట్టి చాలా డ్రామా ఆడాడు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Vijayasai Reddy: ‘రాష్ట్రానికే ఖర్మ’ అంటూ.. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ధ్వజం

ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లాకు చెందిన దిల్దార్ అన్సారీ(28)కి రెండేళ్ల క్రితం రుబికా పహాదిన్ (23) అనే యువతితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరు సహజీవనం చేశారు. అయితే.. పెళ్లెప్పుడు అని ప్రశ్నించిన ప్రతీసారి అన్సారీ అప్పుడు, ఇప్పుడు అంటూ మాట మార్చుతూ వచ్చాడు. చివరికి ఇటీవలే పెళ్లికి అంగీకరించి, ఆమెని వివాహం చేసుకున్నాడు. కానీ, కొన్ని రోజుల్లోనే ఆమెని హత్య చేశాడు. మృతదేహం ఎక్కడ పాతిపెట్టాలో తెలీక.. 50 ముక్కలుగా కోశాడు. ఎలక్ట్రిక్ కట్టర్‌లాంటి పదునైన ఆయుధంతో ఆమె బాడీని ముక్కలుగా చేశాడు. అనంతరం ఆ భాగాలను ఆయా ప్రాంతాల్లో విసిరేశాడు. అయితే.. ఎక్కడ తాను ఈ కేసులో అరెస్ట్ అవుతానోనన్న భయంతో, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు.

Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా

అన్సారీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సంతాలీ మోమిన్‌ తోలా ప్రాంతంలో ఉన్న ఓ పాత ఇంటి వద్ద ఛిత్రమై ఉన్న ఒక మహిళా మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని విచారించిన పోలీసులు.. భర్తే హంతకుడని తేల్చారు. మృతురాలు అతనికి రెండో భార్య అని షాకింగ్ నిజం విచారణలో తేలింది. కేవలం శారీరక సుఖం కోసమే ప్రేమ, పెళ్లి నాటకం ఆడాడని.. ఆమె నుంచి విముక్తి పొందేందుకు ఈ కిరాతకానికి పాల్పడ్డాడని తెలిసింది. ఇప్పటివరకూ 12 శరీర భాగాల్ని గుర్తించిన పోలీసులు, మిగతా భాగాల కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై రాజకీయ దుమారం నెలకొంది. నిందితుడ్ని కఠినంగా శిక్షించకపోతే.. నిరసన చేపడతామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్‌ సహదేవ్‌ హెచ్చరించారు.