Madhya Pradesh: కొన్ని ఘటనలు చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోయిందని అనిపిస్తుంది. కొందరు కామాంధులు బతికి ఉన్నవాళ్లను వేధింపులకు గురిచేయడం ఇప్పటి వరకు చూశాం.. కానీ ఒకడు కన్నూ మిన్నూ తెలియకుండా హాస్పిటల్ మార్చురీలో ఉన్న మహిళా శవంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటికి రావడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
READ ALSO: India-Afghanistan: ‘‘ఆఫ్ఘాన్ మా పొరుగుదేశం’’.. పీఓకేపై పాక్‌కు భారత్ క్లియర్ మెసేజ్..
మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదుతో..
మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో గతేడాది ఏప్రిల్ 18వ తేదీన పోస్ట్‌మార్టం కోసం ఒక మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చి ఉంచారు. ఆ రోజున సాయంత్రం 6.45 గంటలకు స్ట్రెచర్‌పై ఉన్న మహిళా మృతదేహాన్ని చూసిన ఒక వ్యక్తి ఆమె మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఆ హాస్పిటర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. పాత సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈనెల 7వ తేదీన ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగిన ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏడాది కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా బయటపడింది.
25 ఏళ్ల నిందితుడి గుర్తింపు..
భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపట్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నీలేష్ భిలాలాను నిందితుడిగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ కోసం జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీ గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అనేది ఇంకా తెలియరాలేదు. సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు పలువురు పోలీసు అధికారులు తెలిపారు.
READ ALSO: Maria Corina Machado: ట్రంప్‌ను మట్టికరిపించిన వెనిజులా ఉక్కు మహిళ..
