NTV Telugu Site icon

Crime News: తల్లికూతుళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారం.. నిందితుడి అరెస్ట్..

Crime

Crime

Crime News: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మహిళ, ఆమె తల్లిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలను తన దగ్గర ఉంచుకుని వారిద్దరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు.

Read Also: Swati Maliwal Case: స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ తల్లిదండ్రుల్ని ప్రశ్నించనున్న పోలీసులు..ఎందుకంటే..?

బాధిత మహిళలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సలీమ్ అనే వ్యక్తి స్నేహం చేస్తున్నాడు. సలీం సదరు మహిళపై అత్యాచారానికి పాల్పడి ఈ ఘటనను వీడియో తీశాడు. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోని ఇంటర్నెట్‌లో పెడతానంటూ డబ్బులు గుంజేవాడని ఎస్ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ తెలిపారు.

కొన్ని రోజుల క్రితం ఈ వీడియోను డిలీట్ చేస్తానని చెప్పి మహిళ తల్లిని ఓ హోటల్‌కి పిలిచాడు. అయితే, ఆమె అక్కడికి చేరుకున్న తర్వాత ఆమెపై కూడా అత్యాచారం చేసి, దానిని కూడా వీడియో తీశాడు. దీంతో నిందితుడి ఆగడాలను తట్టుకోలేక తల్లికూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం బాధిత మహిళలు ఇద్దరూ పోలీసుల్ని ఆశ్రయించగా.. వారి ఫిర్యాదు మేకు నిందితుడిపై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సలీం నేరాన్ని అంగీకరించాడని, తదుపురి విచారణ జరుగుతోందని ఎస్ఎస్పీ తెలిపారు.

Show comments