Site icon NTV Telugu

Maharashtra: 19 ఏళ్ల మనవరాలిపై పదేళ్లుగా అత్యాచారం.. చివరకు..

Crime

Crime

Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది 58 ఏళ్ల వ్యక్తి తన సవతి మనవరాలిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. 19 ఏళ్ల వయసు ఉన్న యువతిపై గత 10 ఏళ్లుగా అత్యాచారానికి ఓడిగడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కురార్ పోలీసులు గురువారం నిందితుడిపై కేసు నమోదు చేసి, నిందితుడి అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ, కొన్నేళ్లుగా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

2014 నుంచి సవతి తాత తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యువతి ఫిర్యాదు చేసింది. అతను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు బాధితురాలి పొరుగు ఇంట్లో ఉంటున్న సవతి తాత అని, ఇంట్లో ఎవరూ లేనప్పుడు అదును చూసి బాలికపై లైంగిక దాడికి పాల్పడే వాడని చెప్పారు.

Read Also: Neha Murder Case: ‘‘ నా కొడుకును శిక్షించండి’’.. ఫయాజ్ తండ్రి క్షమాపణ..

పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2014 నుంచి తనపై పదేపదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆమెపై శారీరకంగా దాడి చేసేవాడని, ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించే వాడని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. బాలిక అతని బెదిరింపుకు భయపడి, తన కష్టాలను ఎవరికి చెప్పుకోలేదని, కానీ ఇటీవ వేధింపులు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులకు చెప్పిందని అధికారులు వెల్లడించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు గురువారం కురార్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. ఎట్టకేలకు అతన్ని విరార్ నుంచి అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిపై పోక్సోతో పాటు అత్యచార సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.

Exit mobile version