Site icon NTV Telugu

Bengaluru: యువతి హత్య కేసులో నిందితుడి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!

Bengalurumurder

Bengalurumurder

బెంగళూరు హాస్టల్‌లో 22 ఏళ్ల యువతి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువకుడు అర్ధరాత్రి వసతి గృహంలోకి ప్రవేశించి.. యువతిని అత్యంత దారుణంగా పొడిచి.. పీక కోసి చంపేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సహచర యువతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకుని మూడు బృందాలను రంగంలోకి దింపింది. సీసీ కెమెరాలో ఉన్న పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం జల్లెడ పడ్డారు. శనివారం మధ్యప్రదేశ్‌లో గుర్తించి.. అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు.

ఇది కూడా చదవండి: MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..

బీహార్‌కు చెందిన 22 ఏళ్ల కృతి కుమారి బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ కోరమంగళలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో ఉంటుంది. మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక యువకుడు.. ఆమె ఉంటున్న మూడో అంస్తులోకి వెళ్లి డోర్ కొట్టాడు.. కొద్దిసేపటికే ఇద్దరు పెనుగులాడుతో కనిపించారు. రక్షించండి.. రక్షించండి అంటూ ఆమె కేకలు వేస్తోంది. సహచర అమ్మాయిలు వచ్చేలోపే.. నిందితుడు పరారయ్యాడు. అప్పటికే ఆమెకు తీవ్రగాయాలు కావడంతో రక్తపుమడుగులో కొట్టుకుంటోంది. పోలీసులు వచ్చేలోపే ప్రాణాలు వదిలింది.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: ఒలింపిక్స్ లో క్రీడాకారులకు 2లక్షల కండోమ్‌ల పంపిణీ..

అయితే నిందితుడితో ఆమెకు పరిచయం ఉన్నట్లుగా గుర్తించారు. వారిద్దరి మధ్య నిరుద్యోగానికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎలాంటి ఉద్యోగం లేకుండా జులాయిగా తిరగడంతో అతడ్ని దూరం పెట్టింది. అయితే ఇతన్ని వదిలిపెట్టి.. మరో యువకుడి సాయంతో రెండ్రోజుల క్రితం హాస్టల్ మారిపోయింది. దీంతో తనను దూరం పెడుతుందన్న కోపంతో ఆమెను హతమార్చేందుకు ప్లాన్ వేశాడు. మంగళవారం అర్ధరాత్రి ఆమె గదిలోకి వెళ్లడం.. వెళ్లడమే ఎటాక్ చేయడం ప్రారంభించాడు. అతడిని నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించినట్లుగా కనిపించింది. కానీ దుర్మార్గుడు.. ఆమె పీక కోయడంతో నిమిషాల వ్యవధిలోనే తుది శ్వాస విడిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

ఇది కూడా చదవండి: Accident: ఆగి ఉన్న ట్రాలీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం, ఐదుగురికి తీవ్రగాయాలు

Exit mobile version