Site icon NTV Telugu

Chicken: మద్యం మత్తులో ఇంటికి చికెన్ తెచ్చాడు.. సోదరుల చేతిలో చచ్చాడు..

Chicken

Chicken

Chicken: శాఖాహారం తినే ఇంటికి చికెన్ తీసుకువచ్చిన సోదరుడిని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగింది. చికెన్ వ్యవహారంలో సోదరుడి హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చేసిన నేరాన్ని కప్పిపుచ్చేందుకు తల్లి కూడా సహకరించడంతో ఆమెను కూడా నిందితురాలిగా పోలీసులు చేర్చారు.

Read Also: Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు

వివరాల ప్రకారం.. అన్షుల్ అనే వ్యక్తి తన ఇంటి వెలపల నాన్-వెజ్ ఆహారం తినేవాడు. అయితే, అతను శుక్రవారం రాత్రి ఇంటికి మద్యం మత్తులో చికెన్ తెచ్చాడు. ఇది కుటుంబ సభ్యులకు కోపం తెప్పించింది. తాగి ఉన్నప్పటికీ, కిచెన్‌లోకి వెళ్లి ఆహారం తినేందుకు కూర్చున్నాడు. అదే సమయంలో తన సోదరులు అమన్, కుల్దీప్‌లకు చికెన్ చూపిస్తూ వారిని ఎగతాళి చేశాడు. దీంతో అన్నదమ్ములు ఇద్దరు అన్షుల్ మెడకు తాడు బిగించి హత్య చేశారు.

కొనఊపిరితో ఉన్న అన్షుల్‌ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు తెలిసింది. మెడ చుట్టూ గాయాలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. ముందుగా విచారించగా, తల్లి తన ఇద్దరు కొడుకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించింది. హత్యకు ఉపయోగించిన తాడును దాచిపెట్టింది. అన్షుల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపగా, అతను గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించబడింది. పోలీసులు ఇద్దరు సోదరులను, బాధితురాలి తల్లిని విచారించగా నేరం అంగీకరించారు.

Exit mobile version