ప్రస్తుత సమాజంలో చాలామంది పురుషులు వివాహిత సంబంధాలను పెట్టుకుంటూ భార్యలను మోసం చేస్తున్నారు. భార్యలకు అబద్దాలు చెప్పి వేరొక మహిళతో సంబంధం పెట్టుకొని అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే విని ఉన్నాం. ఇక తాజాగా ఒక వ్యక్తి భార్యకు బుక్కవ్వకూడదని ఒక చిన్న తప్పు చేసి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. పూణెకు చెందిన 32 ఏళ్ల వ్యక్తికీ కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భార్యకు తెలియకుండా కొన్నిరోజులుగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో వర్క్ మీద బయటకు వెళ్తున్నా అని చెప్పి లవర్ తో టూర్లకు వెళ్ళేవాడు. ఇక భార్యకు అనుమానం రాకుండా ఆ పాస్ పోర్టులో చెకింగ్ డీటెయిల్స్ ను చింపేసేవాడు.
ఇక అదే మాదిరిగా వారం రోజుల క్రితం ఇంట్లో ఆఫీస్ పనిమీద బయటికి వెళ్తున్నా అని చెప్పి లవర్ తో మాల్దీవులకు ట్రిప్ కు వెళ్లాడు. అక్కడ లవర్ తో ఎంజాయ్ చేసి తిరిగి స్వదేశానికి రావడానికి ఇటలీ లోని ఎయిర్ పోర్ట్ కు రాగా అక్కడ అతడి పాస్ పోర్ట్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించారు. అందులో కొన్ని పేజీలు చిరిగిపోయి ఉండడంతో ఏమైందని అతడిని అడుగగా.. నిజం కక్కాడు. నా భార్య ఫోన్ చేస్తే తాను లిఫ్ట్ చేయలేదని, ఇంటికి వెళ్ళాకా ఆమె పాస్ పోర్ట్ చెక్ చేస్తే తాను లవర్ తో ఉన్నట్లు తెలిసిపోతుందని భావించి ఆ పాస్ పోర్ట్ లో కొన్ని పేజీలను చింపేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక అలా చేయడం పెద్ద నేరమని, దాన్ని పాస్ పోర్ట్ ట్యాపరింగ్ అంటారని ట్యాంకు తెలియదని చెప్పుకొచ్చాడు. అయితే ఏదిఏమైనా సదురు వ్యక్తి చేసింది నేరమే కాబట్టి ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. భార్యకు దొరకకూడదని చేసిన చిన్నతప్పు చివరికి అతడిని జైల్లో ఊసలు లెక్కబెట్టేలా చేస్తోంది.
