Site icon NTV Telugu

Man Sets Wife On Fire: ఆల్కహాల్ తాగుతుండగా భార్యతో వాగ్వాదం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త..

Man Sets Wife On Fire

Man Sets Wife On Fire

Man Sets Wife On Fire: మద్యం తాగుతుండగా భార్యభర్తల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి మద్యం తాగుతున్న సమయంలో భార్య అతడితో వాగ్వాదానికి దిగింది. గొడవ తీవ్రం కావడంతో సదరు వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. మలేషియాలోని సబా రాష్ట్రంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. స్థానిక మద్యం అయిన టపాయ్ తాగుతుండగా, భార్య భర్తల మధ్య గొడవ జరగడం ఈ ఘటనకు కారణమైంది.

Read Also: Guwahati: ట్రయాంగిల్ లవ్.. ఒకేగదిలో ముగ్గురు కలిశాక ఏం జరిగిందంటే..!

పోలీసుల వాదన ప్రకారం.. భర్త మద్యం తాగే సమయంలో భార్య తనకు నిప్పటించాలని సవాల్ చేసిందని, దీంతో కోపోద్రిక్తుడైన ఆమె భర్త, పెట్రోల్ పోసి నిప్పటించినట్లు వెల్లడించారు. ఈ సంఘటన నుంచి తల్లిని కాపాడేందుకు, మంటలు ఆర్పేందుకు 16 ఏళ్ల కూతురు ప్రయత్నించింది. ఆమె తన ఇద్దరు తమ్ముళ్లను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి రక్షించింది. తన బంధువు సాయంతో ఆమె తల్లిని చికిత్స కోసం కెనిన్గౌ ఆస్పత్రికి తరలించింది. అయితే, 16 గంటల తర్వాత 41 ఏళ్ల మహిళ గాయాల కారణంగా ఆదివారం మరణించింది.

హత్యకు పాల్పడిన భర్త(50)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో కూడా నిందితుడు భార్యకు నిప్పు అంటిస్తానని బెదిరించే వాడని పోలీస్ అధికారి వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం ఫిబ్రవరి 9వ వరకు అతనికి రిమాండ్ విధించారు. గతంలో న్యూఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 32 ఏళ్ల మహిళ మద్యం తాగినందుకు తన భర్తతో గొడవ పడింది. నరేందర్ అనే వ్యక్తి తన భార్య బనితపై కొరోసిన్ పోసి నిప్పటించాడు.

Exit mobile version