Site icon NTV Telugu

Accident: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఊరుకొండ మండలానికి చెందిన బాల స్వామి గౌడ్, శివయ్య, యాదయ్య గౌడ్, అంజమ్మ, అనిత, తేజ ఇంద్రకల్ నుంచి దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి త‌మ గ్రామానికి వెళ్తున్నారు.

హైదరాబాద్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పుష్పలత మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామంలో ఓ వివాహానికి హాజరై..వారి స్వగ్రామం ఖానాపూర్‌కు కల్వకుర్తి మీదుగా వెళ్తున్న క్రమంలో తాండ గ్రామ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Fire Accident : భోలక్‌పూర్‌ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోడౌన్‌ భారీ అగ్నిప్రమాదం

Exit mobile version