Site icon NTV Telugu

Mahbubnagar: రేబిస్ ఫోబియా.. తల్లి, కూతురుని బలి!

Crime

Crime

Mahbubnagar: జబ్బు కంటే.. రోగం వచ్చిందన్న మానసిక జబ్బు నరకం చూపిస్తుంది. మహబూబ్ నగర్‌లో సరిగ్గా ఇదే జరిగింది. తమకు రేబిస్ సోకిందన్న అనుమానంతో ఓ తల్లి చేసిన పనికి కూతురు సైతం ప్రాణాలు కోల్పోయింది. సొంత కూతుర్ను చంపేసిన తల్లి ఆ తర్వాత ఉరేసుకుంది.

ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు యశోద. 2014లో మహబూబ్ నగర్‌లోని మోనప్ప గుట్ట ప్రాంతంలో నివాసం ఉండే నరేష్‌తో వివాహమైంది. వారికి ఒక బాబు, పాప ఉన్నారు. భర్త నరేష్ విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. యశోద ఇంట్లోనే ఉంటూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది. సంసారం హాయిగా సాగిపోతోంది అనుకున్న టైమ్‌లో 2 నెలల క్రితం ఓ కుదుపు ఎదురైంది. ఇంటి ఆవరణలో ఎండబెట్టిన పల్లీలు, డ్రై ఫ్రూట్స్‌ను వీధి కుక్కలు ఎంగిలి చేశాయి. కానీ వాటిని అలాగే తినడం వల్ల ఇంటిల్లిపాదికి రేబిస్ వ్యాధి వచ్చిందని యశోద అనుమానపడింది.

Off The record: తెలంగాణ కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలు

కొద్ది రోజులుగా ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్స్, స్కిన్ అలర్జీలు స్టార్ట్ అయ్యాయి. దీంతో యశోద అనుమానం మరింత పెరిగింది. రేబిస్ కారణాంగానే ఇలా జరుగుతోందని అనుకుంది. అంతే కాదు రేబిస్ వ్యాధి లక్షణాలు, కారణాలు వంటి వాటిని నిత్యం గూగుల్‌లో సెర్చ్ చేసేది. ఈ క్రమంలోనే భర్త నరేష్.. అందరికీ రేబిస్ టీకాలు వేయించాడు. ఆకు పసరు, నాటు మందులు కూడా యశోదకు ఇప్పించాడు. కానీ ఆమె అనుమానం మాత్రం వీడిపోలేదు. ఓ రకంగా చెప్పాలంటే రేబిస్ ఫోబియా పట్టుకుంది. ఈ క్రమంలో కూతురు అక్షరను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని చనిపోయింది.

వాయిస్: ఆత్మహత్యకు ముందు.. గదిలో ఉన్న తలుపులు, గోడలపై.. నా భర్తను కాపాడండి, రేబిస్ ఉంది , వ్యాక్సిన్‌కు తగ్గదు. ఇదే నా చివరి కోరిక అంటూ రాసి పెట్టింది. రేబిస్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి మానసికంగా డిస్టర్బ్ అయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ వైవాహిక జీవితం సజావుగానే ఉందని.. ఈ మధ్య కాలంలోనే ముభావంగా ఉండే యశోదకు అనుమానమే పెనుభూతమై ఇంతటి దారుణానికి ఒడి గట్టిందని ఫ్యామిలి మెంబర్స్ చెబుతున్నారు.

Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో

రేబిస్ వ్యాధి ఉందని అనుమానం ఉంటే.. అందుకు తగిన విధంగా పరీక్షలు చేయించుకుంటే సరిపోయేదని స్థానికులు చెబుతున్నారు. కానీ ఆ విధంగా చేయకుండా ఏదేదో ఊహించుకోవడం వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయని చెప్పుకుంటున్నారు.

Exit mobile version