NTV Telugu Site icon

Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడికి మరణశిక్ష విధింపు..

Crime

Crime

Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడికి పూణే సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. పూణే జిల్లాలోని మావల్ తాలుకాలో 24 ఏళ్ల నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 2022లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో సాక్ష్యాధారాలు దాచి పెట్టినందుకు నిందితుడి తల్లికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

Read Also: Moscow Attacks: ఉగ్రదాడిపై రష్యాకు అండగా ఉంటామని ప్రధాని మోడీ హామీ..!

విచారణలో ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించారు. నిందితుడు మృతదేహాన్ని ఇంటి వెనక చెట్టు కింద ఉన్న గొయ్యిలో పూడ్చి పెట్టడానికి ప్రయత్నించాడని, అతని తల్లి కొడుకును శిక్ష నుంచి రక్షించడానికి సహకరించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కవేరియా కోర్టుకు తెలియజేశారు. నిందితుడు సెక్స్ ఉన్మాదని, కనికరం లేని లైంగిక ఆలోచనలతో ఈ దారుణానికి ఒడిగట్టాడని, చైల్డ్ పోర్నోగ్రఫీని చూసే అలవాటు ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసులు అక్టోబర్ 2022లో విచారణకు వచ్చింది. చార్జిషీట్ దాఖలు చేసిన కేవలం 8 నెల్లలోనే 29 మంది సాక్ష్యలను విచారించారు.

ఈ నేరం లైంగిక వ్యామోహం, క్రూరమైన వ్యక్తి చేసిన అత్యంత హేయమైన, అనాగరిక చర్యలలో ఒకటిగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ సంఘటన ఆగష్టు 2022లో జరిగింది. పుణె రూరల్ పోలీసుల పరిధిలోని కమ్‌షెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది, సుమారు ఒక సంవత్సరం ఏడు నెలల్లో శిక్ష పడింది.

Show comments