Site icon NTV Telugu

Wife Kills Husband: భర్తను చంపిన మూడో భార్య, ఆమె లవర్..

Wife Kills Husband

Wife Kills Husband

Wife Kills Husband: ఇటీవల కాలంలో మగాళ్లు పెళ్లి అంటేనే భయపడి చస్తున్నారు. సింగిల్‌గా ఉన్నా మంచిదే కానీ, పెళ్లి చేసుకుని, భార్య చేతిలో హతం అవ్వడం ఎందుకు అని అనుకునే పరిస్థితులు వచ్చాయి. వరసగా దేశంలో చాలా ఘటనలు వారి మనసులో భయాలను పెంచుతున్నాయి. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాలోని సకారియా గ్రామంలో జరిగింది.

బాధితుడిని 60 ఏళ్ల భయ్యాలాల్ రజక్‌గా గుర్తించారు. అతడి మూడో భార్య మున్నీ అతడి లవర్‌తో కలసి భయ్యాలాల్‌ని హత్య చేసింది. భయ్యాలాల్ మొదటి భార్య అతడిని వదిలి వెళ్లింది, ఆ తర్వాత గుడ్డిబాయి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీంతో, గుడ్డి బాయి చెల్లెలు మున్నీని భయ్యాలాల్ మూడో వివాహం చేసుకున్నారు. మున్నీతో అతడికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

Read Also: Tirumala : చంద్రగ్రహణం ప్రభావం.. మధ్యాహ్నం 3.30కి తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

అయితే, స్థానికంగా ఉండే స్థిరాస్తి వ్యాపారి నారాయణ్ దాస్‌ కుష్వాహాతో మున్నీకి సంబంధం ఉంది. మున్నీ, నారాయణ్‌లు ఇద్దరు కలిసి భయ్యాలాల్‌ను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నారు. హత్య చేయడానికి 25 ఏళ్ల కూలీ ధీరజ్ కోల్‌ను నియమించుకున్నారు. ఆగస్టు 30 రాత్రి, భయ్యాలాల్ తన ఇంట్లో నిద్రిస్తూ ఉండగగా, నారాయణ్ దాస్, ధీరజ్ లోపలికి వెళ్లి ఇనుప రాడ్‌తో తలపై కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సంచిలో చుట్టి గ్రామంలోని బావిలో పడేశారు.

అయితే, మరుసటి రోజు ఉదయం రెండో భార్య గుడ్డి బాయి బావిలో తేలుతున్న శవాన్ని గమనించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికి తీశారు. బావిలో అతడి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. 36 గంటల్లోనే పోలీసులు ఈ హత్యను ఛేదించారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version