Madhya Pradesh: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా అనేక చిత్రహింసలు పెట్టాడు. ప్రస్తుతం బాధిత మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నిందితుడిని అయాన్ పఠాన్(24)గా గుర్తించారు. 23 ఏళ్ల మహిళపై దాడి చేసి, అత్యాచారం, చిత్రహింసలకు గురిచేసినందుకు అరెస్ట్ చేయబడ్డాడు. బాధితురాలు, నిందితుడు పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: Prakash Goud: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి ప్రకాశ్ గౌడ్
మహిళ తండ్రి కొంత కాలం క్రితమే మరణించాడు. ఆమె తల్లి పేరుపై ఆస్తి ఉంది. దీంతో ఈ ఆస్తిపై కన్నేసిన పఠాన్ ఆమెతో ప్రేమ నటించి, తనను పెళ్లి చేసుకోవాలని, ఆస్తిని తన పేరుపై రాయాలని బలవంతం చేస్తుండేవాడని తేలింది. అయితే, ఆస్తిని అమ్మేసినట్లు బాధితురాలి తల్లి చెప్పడంతో అయాన్ పఠాన్ మహిళను బంధించి గత నెల రోజులుగా పదే పదే అత్యాచారం చేస్తున్నట్లు తేలింది అంతటితో ఆగకుండా ఆమెను బెల్టు, పైపులో చావబాదాడు. ఆ గాయాలపై, నోట్లో, కంటిలో కారం పోసి చిత్రహింసలు పెట్టేవాడు. ఆమె అరుపులు వినిపించకుండా పెదవులకు ఫెవిక్విక్ వేసి సీల్ చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బాధితురాలి తల్లి శివపురిలో ఉన్నట్లు తేలింది. చివరకు మంగళవారం మహిళ తప్పించుకుని ప్రాణాలు దక్కించుకుంది.
ప్రస్తుతం తీవ్రగాయాలతో బాధితురాలు గుణ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకుని, నిందితుడని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఏఎస్పీ మాన్ సింగ్ ఠాకూర్ మంగళవారం ఈ ఘటన జరిగిందని తెలిపారు. బాధితురాలకి, నిందితుడికి రెండేళ్లుగా రిలేషన్ ఉన్నట్లు తెలిపారు. నిందితుడి ఇంట్లో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
