అదేదో సినిమాలో కార్ల దొంగలు సూటు బూటు వేసుకుని మరీ రంగంలోకి దిగుతారు. ఖరీదైన కార్లను మాయం చేస్తారు. అదే సీన్ నిజంగా జరుగుతోంది. లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. రాజస్థాన్ జైపూర్ కు చెందిన ఆర్మీ జవాన్ కుమారుడు సత్యేంద్ర సింగ్ షెకావత్. 2003 నుంచి కార్ల దొంగగా మారాడు సత్యేంద్ర.
ఇప్పటివరకు నిందితుడిపై పది రాష్ట్రాల్లో 61 చోరీ కేసులు వుండడం విశేషం. అధునాతన సాంకేతికతతో కార్ల దొంగతనాలు చేస్తుంటాడు. గతేడాది జనవరిలో బంజారాహిల్స్ పరిధిలో ఓ స్టార్ హోటల్ లో లగ్జరీ కారు దొంగతనం చేశాడు సత్యేంద్ర. దమ్ముంటే నన్ను పట్టుకోండని పోలీసులకు వీడియో కాల్ చేసి మరీ సవాల్ విసిరాడు సత్యేంద్ర.
సత్యేంద్ర ఎక్కడున్నాడో తెలీలేదు. చివరాఖరికి ఫిబ్రవరిలో సత్యేంద్రను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. పీటీ వారెంట్ పై మూడు రోజుల కస్టడీ విచారణకు బంజారాహిల్స్ పీఎస్ కు తరలించారు పోలీసులు. కార్ల రికవరీ కోసం విచారణ చేస్తున్నారు పోలీసులు. సత్యేంద్ర అరెస్ట్ విషయం తెలుసుకుని ఎంతమంది కార్ల యజమానులు పోలీసుల్ని ఆశ్రయిస్తారో చూడాలి.
Read Also: Fake Seeds: నకిలీ విత్తనాల పంజా.. అన్నదాతల విలవిల
