ఈమధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్ళు పరువు హత్యలకు కారణం అవుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. పెళ్లి చేసుకోకపోతే చనిపోతా… నా కూతురుని పెళ్లి చేసుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తా అని ప్రేమికురాలి బంధువుల బెదిరించడంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన సాయినాథ్, స్థానిక పాత్ ఫైండర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చేశాడు. బీటెక్ చేసే క్రమంలో గూడూరు మండలం ఆపూర్ తాండకు చెందిన ప్రియాంక తో కళాశాలలో పరిచయం ఏర్పడింది బీటెక్ పూర్తయ్యాక హైదరాబాదులో ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాయినాథ్, ప్రియాంకలు వేరువేరుగా పనిచేసుకుంటున్నారు.
ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకోవడంతో వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. విషయం ప్రియాంక తల్లిదండ్రులకు తెలియడంతో ప్రియాంక తండ్రి అన్నయ్యలు సాయినాథ్‌ని బెదిరించారు. ప్రియాంకను చేసుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో సాయినాథ్ మిల్స్ కాలనీ పోలీసులను జూన్ నెలలో ఆశ్రయించాడు. పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించి వారు మేజర్ అయినందున వారి ఇష్టం ఉన్న వారిని వివాహం చేసుకునే హక్కు ఉంటుందని ప్రియాంక తరపు వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
Read Also: Fake Police Station: ఇది నెక్ట్ లెవల్.. పోలీస్ అధికారి ఇంటికి దగ్గర్లోనే ఫేక్ పోలీస్ స్టేషన్.
కొన్ని రోజులు దూరంగా ఉన్న సాయినాథ్ ప్రియాంకలు మళ్లీ ఫోన్లో మాట్లాడుకోవడం …కలుసుకోవడం చేయడంతో మళ్లీ ప్రియాంక తరపు వారి నుండి బెదిరింపులు ఎక్కువయ్యాయి, ప్రియాంక కూడా ఈనెల 20వ తేదీన మనం కచ్చితంగా వివాహం చేసుకోవాలి లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో మనస్థాపానికి గురైన సాయినాథ్ బుధవారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం గమనించిన సాయినాథ్ తండ్రి చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం సాయినాథ్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read Also:Gautham Karthik: ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న స్టార్ హీరో కొడుకు..?
