Site icon NTV Telugu

Vizag Crime: విశాఖలో రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది.. తల్లి, కూతురుపై దాడి

Attack

Attack

Vizag Crime: విశాఖపట్నంలో మరో ప్రేమోన్మది రెచ్చిపోయాడు.. మధురవాడలో ప్రేమోన్మాది దాడి ఘటన మరువక ముందే.. మరో ఘటనతో విశాఖ నగరం ఉలిక్కిపడింది.. తాజా ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. గాజువాకకు చెందిన యువకుడు.. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన బాలికను ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు.. వీరిద్దరూ ఇంటర్ చదువుతున్నారు.. ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసిపోవడంతో బాలికకు వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.. విషయం తెలుసుకున్న సదరు యువకుడు.. బాలిక ఇంట్లోకి చొరబడి.. తల్లి, కూతురుపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు.. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు.. యువకుడి దాడి నుంచి కాపాడాలంటూ.. తల్లి కూతుర్లు ఇద్దరు కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు సదరు యువకుడు.. స్థానికులు.. తల్లీకూతుళ్లను ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు..

Read Also: CM Revanth Reddy: ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది.. నా బ్రాండ్ యంగ్ ఇండియా

Exit mobile version