Anakapalli: అనకాపల్లి జిల్లాలో ప్రేమ పరువు హత్య తీవ్ర కలకలం రేపుతుంది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన డెక్క నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది. అయితే, నవీన్ రాంబిల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి, వారు నవీన్‌ను అరుణాచలానికి తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగినదో తెలియదు, తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది.
Read Also: Ahmedabad plane crash: ముగిసిన 3 నెలల గడువు.. విమాన ప్రమాదంపై ఎటూ తేల్చని భద్రతా ప్యానెల్
ఇక, నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని యువతి తల్లి ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను నవీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నవీన్‌ను తల్లి కూతుళ్లు ఇద్దరు ప్రేమించిన పాపానికి దారుణంగా హత్య చేసి, అనుమానాస్పద మృతి కేసుగా తప్పుదోవ పట్టించడం జరుగుతున్నట్లు వారు ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టి, తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
