Site icon NTV Telugu

Strange Thief: అదేం ఆనందమో..! మహిళల జాకెట్లు మాయం చేస్తున్న దొంగ..

Jackets

Jackets

Strange Thief: ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అన్నారు పెద్దలు.. ఇది చాలా సార్లు చూస్తూనే ఉంటాం.. ఇక, దొంగల్లో కూడా వెరైటీ దొంగలు పట్టుబడుతూనే ఉంటారు.. కొందరు చిన్నా చితక వస్తువల జోలికి పోకుండా.. డబ్బులు, బంగారం.. కార్లు, బైక్‌లు.. ఇలా విలువైన వస్తువులను మాయం చేస్తుంటే.. కొందరు చెప్పులు.. షూస్‌.. ఇంకా కొందరు మహిళల లో దుస్తులు కూడా మాయం చేసిన సందర్భాలు ఉన్నాయి.. ఈ మధ్యే హైదరాబాద్‌లో షూస్‌ ఎత్తుకుపోయే దొంగను పట్టుకున్నారు స్థానికులు.. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఓ విచిత్రమైన దొంగను పట్టుకున్నారు.. అతని దగ్గర లభించిన వస్తువలును చూసినవారికి షాక్‌తిన్నంత పనైంది..

Read Also: NTR : ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ అంగీకారం!

బండి పోయింది.. ఇంట్లో వస్తువులు, నగదు దోచుకుపోయారు.. ఇలా దొంగతనాలు గురించి సాధారణంగా మనం వింటూ ఉంటాం.. అయితే, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఓ దొంగ చేసే చోరీలు వింతగా ఉన్నాయి. వందల సంఖ్యలో దొంగతనాలు చేసిన ఖరీదైన వస్తువుల్ని దోచుకుపోలేదు.. ఇంతకీ ఈ వింత దొంగ చేసిన చోరీలు వింటే మీకే ఆశ్చర్యం కలగక తప్పదు.. ఎందుకంటే అతను చేసిన చోరీలు ఏమిటంటే మహిళలు ఆరవేసిన జాకెట్లు ఎత్తుకుపోవడం.. నరసాపురం మండలంలో గత ఆరు నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్‌రూమ్‌లో.. బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో గ్రామస్తులు నిఘా పెట్టారు.. ఇక, బుధవారం రాత్రి దొంగను పట్టుకున్నారు. అతను వద్ద ఉన్న సంచిలో పెద్ద సంఖ్యలో జాకెట్లు చూసి షాక్ అయ్యారు. వేముల దీవి గ్రామానికి చెందిన వ్యక్తిగా దొంగను గుర్తించారు. నిలదీయగా ఇప్పటి వరకు 00లకు పైగా జాకెట్లను దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. దొంగలించిన జాకెట్లు కాలవల్లో పడేస్తున్నట్టు చెప్పాడు.. అతని ప్రవర్తనను గమనించిన గ్రామస్తులు మానసిక రోగిగా గుర్తించి పోలీసులకు అప్పగించారు.

Exit mobile version