Site icon NTV Telugu

Leopard In Village: జనావాసంలోకి ప్రవేశించిన చిరుతపులి.. చితకొట్టిన జనం

Untitled Design (4)

Untitled Design (4)

హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలి ప్రాంతంలోని ఒక గ్రామంలోకి ఒక చిరుతపులి ప్రవేశించింది.. దానిని గ్రామస్తులు దానిని కొట్టారు. అయితే.. ఇక్కడ ఓ చిరుతపులి మనుషుల మధ్యలోకి రావడంతో .. అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరి మీద పడి చిరుత పులి దాడి చేసింది. వెంటనే రాళ్లు, కర్రలతో దానిపై దాడికి యత్నించారు. దీంతో ఆ చిరుత పులి అక్కడి నుంచి భయంతో దూరంగా పారిపోయింది. ఇంత జరిగనప్పటికి అటవీ శాఖ అధికారులు అక్కడ కనిపించలేదు. అయితే చిరుత దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అడవులను అక్రమించుకోవడంతోనే.. అవి జనవాసాల్లోకి వస్తున్నాయంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read Also:Cyber Fraud: ఎందిరయ్యా.. ఇది.. చాయ్ అమ్మే వ్యక్తి దగ్గర రూ. 1.05 కోట్లు..

ఇటీవల గ్రామాల్లోకి, ఇళ్లలోకి వన్య ప్రాణులు రావడం మనం తరచుగా చూస్తునే ఉన్నాం. కొన్ని సార్లు ఈ జంతువుల దాడిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడిన ఘటనలు లేకపోలేదు. ముఖ్యంగా చిరుత పులులు ఎక్కువగా గ్రామాల్లో తిరుగుతూ.. అందరిని భయపెడుతున్నాయి. కొన్ని దాడులు చేస్తూ.. ప్రాణాలు తీస్తున్నాయి. .తగ్గిపోతున్న ఆవాసాలు, మానవ ఆక్రమణలు, పశువుల వంటి విస్తారమైన ఆహారం ఉండటం వల్ల పెద్ద పిల్లులు మానవ నివాసాలకు దగ్గరగా వస్తున్నాయి, ఇవి తరచుగా మానవులకు జంతువులకు ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తాయి.

Exit mobile version