NTV Telugu Site icon

Vijayawada Crime: ప్రియురాలి హత్యకు న్యాయవాది ప్రయత్నం.. కారుతో ఢీకొట్టి..

Road Accident

Road Accident

Vijayawada Crime: ప్రియురాలి హత్యకు ఓ న్యాయవాది ప్రయత్నించిన ఘటన విజయవాడలో కలకలం సృష్టించింది.. న్యాయవాది అన్వర్ తన కారుతో బీభత్సం సృష్టించాడు.. తన ప్రియురాలు నసీమాపై హత్యాయత్నం చేశాడు.. ఆమె ప్రయాణిస్తున్న కారును తన కారుతో ఢీకొట్టిన అన్వర్.. కారుతో గుద్ది చంపేయాలని ప్రయత్నించాడు.. ఇక, ఆ తర్వాత అదే రోడ్డులో ఉన్న మరిన్ని వాహనాలను కూడా ఢీ కొట్టి వెళ్లిపోయాడు.. గతంలో నసీమా అనే మహిళ.. న్యాయవాది అనర్వ్‌ మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది.. అంతేకాదు.. ఈ ఇద్దరు కలిసి నసీమా భర్త అసలామును హత్య చేశారు.. ఈ ఈ హత్య కేసులో నసీమా – అన్వర్ ఇద్దరు నిందితులుగా ఉన్నారు.. అయితే, ప్రస్తుతం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. నసీమాపై హత్యాయత్నానికి అన్వర్‌ దిగినట్టుగా తెలుస్తోంది.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు..

Read Also: CM Revanth Reddy : వాళ్లకి జైల్లో డబుల్‌రూం కట్టిస్తానని హామీ ఇచ్చా.. ఆ హామీ కూడా ఇంకా నెరవేర్చేలేదు