Kukatpally Minor Girl Murder : హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో మైనర్ బాలిక హత్య కేసు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కుటుంబానికి ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దుండగులు దాడి చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు తాజాగా కీలక పరిణామాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు, బాలిక నివాసముంటున్న అదే బిల్డింగ్‌లో అద్దెకు ఉంటున్న సంజయ్ అనే యువకుడని తెలుస్తోంది. బాలిక హత్య తర్వాత అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Sriram sagar project : గంట గంటకూ పెరుగుతున్న వరద ప్రవాహం
బాలికపై సుమారు 20 వరకు కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది. మెడ దగ్గర 14 గాట్లు, పొట్ట దగ్గర 7 గాట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఒక పదునైన ఆయుధంతో అత్యంత క్రూరంగా హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 5 ప్రత్యేక టీంలు కేసు దర్యాప్తు చేస్తున్నాయని, ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. అలాగే, హత్య జరిగిన ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు వెంకటేష్ – రేణుక దంపతులు ముగ్గురు పిల్లలతో కలిసి కొన్నాళ్ల క్రితం కూకట్‌పల్లికి వలస వచ్చారు. వెంకటేష్ బైక్ మెకానిక్‌గా, రేణుక ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం ఉదయం భార్యాభర్తలు పనికి వెళ్లగా, వారి 12 ఏళ్ల కుమార్తె సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇంటికి చేరుకున్న వెంకటేష్, కూతురు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
పోలీసుల అనుమానాల ప్రకారం, హత్యకు ముందు నిందితుడు బాలికపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించి, బాలిక ప్రతిఘటించడంతో కత్తిపోట్లు గుద్దినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌లో ఒక యువకుడు బాలిక ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ వ్యక్తి కుటుంబానికి దగ్గరి బంధువేనని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిజమైన నేరస్తుడిని పట్టుకొని పూర్తి వివరాలు బయటపెడతామని అధికారులు స్పష్టం చేశారు.
PM Modi: భారత్‌ను రెండుసార్లు విభజించిందే నెహ్రూ.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ఫైర్!
