Site icon NTV Telugu

Girlfriend Ride: బైక్‌పై ప్రియురాలు షికార్లు.. తట్టుకోలేక ప్రియుడు ఏం చేశాడంటే?

Boyfriend Suicide Attempt

Boyfriend Suicide Attempt

Krishna Dist Boy Attempt Suicide After Lover Ignores His Request: ఒక్కొక్కిరిది ఒక్కో మనస్తత్వం. కొందరు తమ ప్రియురాళ్లకు స్వేచ్ఛనిస్తే.. మరికొందరు అబ్బాయిలు మాత్రం తాము చెప్పినట్లుగా ప్రియురాళ్లు వినాలని కోరుకుంటారు. తమకు నచ్చని పని ఏదైనా చేస్తే.. ఈ రెండో రకం అబ్బాయిలు అస్సలు తట్టుకోలేరు. కోపంతో విరుచుకుపడతారు లేదా తామే ఏదో ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు ఓ అబ్బాయి కూడా అదే పని చేశాడు. తన ఎదురుగానే ప్రియురాలు కొత్త బైక్‌పై షికార్లు కొట్టడం చూసి తట్టుకోలేక పోయిన ప్రియుడు.. ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Asia Cup : పాక్ కు ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆసియా కప్ నిర్వహణే ప్రధాన లక్ష్యం..!

గుడివాడలోని మార్వాడీ గుడికి చెందిన బవర్ సింగ్ అనే యువకుడు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీ దుకాణం నడుపుతున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉండగా.. రెండో కుమారుడైన శైలేష్ సింగ్ స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కట్ చేస్తే.. రీసెంట్‌గా శైలేష్ ప్రియురాలు ఒక కొత్త బైక్ కొనుగోలు చేసింది. అందులో ఆమె షికార్లకు వెళ్లిరావడం మొదలుపెట్టింది. అయితే.. శేలష్‌కు ఇది నచ్చలేదు. ప్రియురాలు ఇలా బైక్‌లో షికారుకి వెళ్లడాన్ని అవమానంగా భావించాడు. దీంతో.. ఈ విషయాన్ని అతడు ఆ యువతికి చెప్పాడు. బైక్ నడపొద్దని, తనకు నచ్చట్లేదని తన మనసులోని మాటని ఆ యువతికి వెల్లడించాడు. కానీ.. ఆ యువతి అతని మాటల్ని పట్టించుకోలేదు. నా బైక్ నా ఇష్టం అంటూ.. షికార్లు కొట్టడం మళ్లీ ప్రారంభించింది.

Kangana Ranaut: హద్దు మీరితే, కాల్చి చంపేస్తా.. కంగనా స్ట్రాంగ్ వార్నింగ్

అది చూసి తట్టుకోలేకపోయిన శైలేష్.. ఆదివారం సాయంత్రం మరోసారి తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. బైక్‌పై తిరగొద్దని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ‘నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో’ అని ఆ యువతి బదులివ్వడంతో, అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ బాధలోనే అతడు అన్నంత పని చేశాడు. ప్రియురాలి ఇంటి ముందే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో శైలేష్ శరీరం 80% కాలిపోయింది. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉంది. మెరుగైన చికిత్స కోసం శైలేష్‌ను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version