Site icon NTV Telugu

Haryana Cop Arrest: కోట్ల చలాన్ స్వాహా.. పోలీసునే అరెస్ట్ చేసిన పోలీసులు

Haryana Cop

Haryana Cop

Haryana Cop Arrest: అతనో పోలీసు.. అతను డ్యూటీలో భాగంగా ఈ- చలాన్లు విధిస్తుంటారు. ఇలా చలాన్లు విధించగా వచ్చిన డబ్బులను వారు ప్రతి రోజూ బ్యాంకులో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్‌ చేసిన డబ్బుల్లో నుంచి పోలీసులకు అవసరమైన సమయంలో స్టేషనరీ ఇతర అవసరాలకు ఆ నిధులను ఉపయోగించుకుంటారు. అయితే ఈ- చలాన్ల రూపంలో వచ్చిన నిధులను బ్యాంకులో డిపాజిట్‌ చేయకుండా చేతి వాటం చూపించాడు హెడ్‌కానిస్టేబుల్‌. డిపాజిట్‌ చేయాల్సిన దానిలో మొత్తం చేయకుండా కొంత మేరకే చేసేవాడు. ఇలా ఒక రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడేళ్లుగా ఇలానే చలాన్ల రూపంలో వచ్చిన మొత్తం డిపాజిట్‌ చేయకుండా .. కొంత మొత్తమే డిపాజిట్‌ చేస్తూ వస్తున్నాడు. ఇలా చేయడంతో మూడేళ్లో్ల రూ. 3.23 కోట్లు డిపాజిట్‌ కావల్సి ఉండగా.. కేవలం రూ. 30 లక్షలు మాత్రమే బ్యాంక్‌లో డిపాజిట్‌ అయింది. మూడేళ్ల తరువాత కళ్లు తెరచిన పోలీసులు తీరా అరెస్టు చేద్దామనుకోగా.. అప్పటికే ఆ పోలీస్‌ దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.. ఇది హర్యానా రాష్ట్రంలో జరిగింది.

Read also: PM Modi: ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించేందుకు మెట్రో ఎక్కిన ప్రధాని మోడీ

హర్యానా రాష్ట్రంలోని పాల్వాల్‌లో ఈ-చలాన్‌లలో ₹ 3.23 కోట్లు మోసగించినందుకు హర్యానా పోలీసు హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు.. మరొకరి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరు పోలీసులపైనా ఈ-చలాన్ డబ్బును బ్యాంకులో జమ చేయలేదని ఆరోపణలపై కేసు నమోదు చేశారు. DSP ర్యాంక్ అధికారి దర్యాప్తు ఆధారంగా ఈ విషయంపై FIR నమోదు చేయబడింది. జానక్, ఓంవీర్‌లపై పాల్వాల్‌లోని క్యాంప్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ చేశారు. అందులో ఒకరైన ఓంవీర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపులు జరుపుతుండగా బుధవారం జానక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read also: Vijayashanthi: ఎమ్మెల్యే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ పై విజయశాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ-చలాన్ చెల్లింపులు సకాలంలో బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని పాల్వాల్ ఎస్పీ లోకేంద్ర సింగ్‌కు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన రికార్డులను జనవరి 2020 నుండి మార్చి 31, 2023 వరకు ఉన్న రికార్డులను పరిశీలించారు. ఈ కాలంలో కేవలం ₹ 30 లక్షలు మాత్రమే పోలీసుల ఎస్‌బిఐ బ్యాంకు ఖాతాలో జమ కాగా.. మొత్తం ₹ 3.23 కోట్ల వరకు జమ కాలేదని తేలింది. పోలీసు నిబంధనల ప్రకారం.. ప్రతి రోజు సాయంత్రం బ్యాంకులో చలాన్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. కానీ జనక్ పాక్షిక మొత్తాన్ని మాత్రమే డిపాజిట్ చేసేవాడు.. అది కూడా 15 రోజులకు ఒకసారి డిపాజిట్ చేసేవాడు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ దోపిడీని అప్పటి చలాన్ బ్రాంచ్ ఇన్‌చార్జి జానక్ చేసాడని.. అతన్ని సిటీ కోర్టులో హాజరుపరిచి ఐదు రోజుల పోలీసు రిమాండ్‌పై తీసుకున్నామని పోలీసు అధికారి మోర్‌ తెలిపారు. అతనితోపాటు.. ఇతర వ్యక్తుల ప్రమేయం గురించి విచారిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ ఓంవీర్‌ను పట్టుకోవడానికి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు మోర్ చెప్పారు.

Exit mobile version