NTV Telugu Site icon

Killed with Tractor : పాత కక్షలు.. ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య..

Crime Scene

Crime Scene

రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నేవూరి నరసయ్య (42) అనే వ్యక్తిని ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి హత్య కు పాల్పడినట్లుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు కిషన్ ఉన్నాడని తెలుసుకున్న బంధువులు… స్టేషన్ పై దాడి చేశారు. అంతేకాకుండా.. అడ్డొచ్చిన పోలీసులను కూడా మృతుడి బంధువులు చితకబాదారు. దీంతో ఒక్కసారి పోలీస్ స్టేషన్‌ వద్ద ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది. రుద్రంగి ఎస్సై, చందుర్తి సీఐ మృతిని పట్ల వ్యవహరించిన తీరు పై బంధువులు మండిపడ్డారు. అకారణంగా కేసులు పెట్టి హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ములను ఎంతో హింసించావు భర్త పోయాడు ఇక తాళి తీసుకో అంటూ చందుర్తి సీఐ శ్రీలత కు మృతుడి భార్య దేవేంద్ర తాళి ఇవ్వడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి.. ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

రుద్రంగిలో కొనసాగుతున్న ఉద్రిక్తత…

మృతుడి మృతదేహంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు బంధువుల, గ్రామస్తుల ధర్నాకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య మృతుడి బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య దేవేంద్ర మాట్లాడుతూ.. హత్య చేసిన కిషన్ కి మాకు మూడు ఏళ్ల నుంచి భూమి విషయంలో గొడవ జరుగుతుందని, అప్పటి నుండి అన్యాయనికే పోలీసులు మద్దతు ఇచ్చారని ఆమె ఆరోపించారు. రుద్రంగి ఎస్సై ముందే మా ఆయన పట్ల ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడని, మా ఆయనను గతంలో హార్వెస్టార్ తో గుద్దాడని, బండి డ్యామేజ్ అయింది. చేతికి గాయాలయ్యాయి.. మేము చందుర్తి సీఐ మేడమ్ గారికి ఫిర్యాదు చేస్తే…ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వదిలిపెట్టి సీఐ మేడమ్ మళ్ళీ మా ఇంటికి వచ్చింది.. ఇదెక్కడి న్యాయం..పోలీసులది..ఇదా మీ పోలీసులు చేసే న్యాయం.. ఇది వరకే నా భర్తను కాపాడండి అంటూ సీఐ మేడమ్ కాళ్ళు మూడు సార్లు పట్టుకున్న అయిన నా భర్త ప్రాణం తీసాడు.. పోలీసులు న్యాయం చేయలేదు.. మీరు అన్యాయానికి సపోర్ట్ ఇచ్చారు మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు అంటూ మృతుడి భార్య దేవేంద్ర అగ్రహం వ్యక్తం చేసింది.