దొంగతనం చేయడం ఆ దొంగకి కొత్త అనుకుంటా. అందుకేనేమో ఆ దొంగ విచిత్రమయిన పద్ధతిని అనుసరించాడు. చేసేది దొంగతనం. అదికూడా అమ్మవారి ఆలయంలోనే. కానీ అమ్మ దయకావాలనుకున్నాడు. అమ్మా అంతా బాగా జరిగేలా చూడు అంటూ అమ్మనే మొక్కుకున్నాడు. తాను చేస్తున్నది దొంగతనమే కానీ అమ్మ దయ కావాలనుకున్నాడు. ఖమ్మంలోని అంకమ్మ దేవాలయంలో చోరీ జరిగింది.
అమ్మవారి ఆలయానికి దొంగతనానికి వచ్చిన దొంగ అమ్మవారికి దండం పెట్టి మరీ చోరీకి ప్రయత్నించాడు.ఈ తతంగం అంతా సీసీ కెమేరాలో రికార్డయింది. అమ్మా నన్ను క్షమించు. నీ కాళ్ళు మొక్కుతా. అమ్మవారికి పెట్టిన దండం విజువల్స్ వైరల్ అవుతున్నాయి. వీడేం దొంగరా బాబూ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఆలయం తలుపులు బద్దలు కొట్టి మరీ హుండీ దోచేశాడు. ఈ విజువల్స్ ఆధారంగా దొంగ భరతం పట్టే పనిలో బిజీ అయ్యారు పోలీసులు.