NTV Telugu Site icon

Online Trolling: బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ తర్వాత టీనేజర్‌పై ట్రోలింగ్.. ఆత్మహత్య..

Online Trolling

Online Trolling

Online Trolling: ఆన్‌లైన్ ట్రోలింగ్ 12 వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రాణాలను తీసింది. తన బాయ్‌ఫ్రెండ్‌‌తో విడిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను వేధించారు. అదే పనిగా ట్రోలింగ్ చేయడంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి బంధువులు పేర్కొన్నారు. ఈ ఘటన కేరళలో జరిగింది. కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయింది. దీని తర్వాత ఆమెను ట్రోలింగ్ చేయడం ద్వారా మానసికంగా హింసించారు. దీంతో ఆమె బలవన్మరనానికి పాల్పడింది.

Read Also: Hyderabad: కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రి.. నిరాకరించడంతో దారుణ హత్య

12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల యూట్యూబర్ ఆదిత్య ఎస్ నాయర్ గత వారం తిరువనంతపురంలోని తన ఇంటిలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంలో ఐసీయూలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేక్‌అప్ చెప్పిన తర్వాత నుంచి ఆదిత్య ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులకు గురవుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిరంతర ట్రోలింగ్ ఆమె మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. ఆమె లవ్ ఎఫైర్ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు చదువుపై దృష్టిపెట్టాలని సూచించడంతో, ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కి రెండు నెలల క్రితం బ్రేకప్ చెప్పింది.

ఈ కేసులో ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తిరువనంతపురంలోని ఉజమలక్కల్‌కు చెందిన బినోయ్‌‌గా గుర్తించారు. ఆదిత్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పూజపురా పోలీసులు బినోయ్‌పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.ఎఫ్ఐఆర్ ప్రకారం, ఇద్దరు కూడా ఇద్దరు కూడా రొమాంటిక్ రిలేషన్ కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని అమ్మాయి తన తల్లిదండ్రులకు వెళ్లడించిన తర్వాత అబ్బాయి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత తాము ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. ప్లస్-2 పరీక్షలు జరుగుతున్నందున వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆదిత్య యుక్త వయసుకు రాకముందు నుంచే రిలేషన్ కలిగి ఉన్నట్లు తేలింది. ఆదిత్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు.